రిలయన్స్ కంపెనీ అందిస్తోన్న అతి చవకైన స్మార్ట్ ఫోన్ మోడల్ ఈ జియో ఫోన్ 3. రిలయన్స్ కంపెనీ నుంచి గతంలో విడుదలైన రెండు రకాల జియో ఫోన్లు హాట్ కేకుల్లా ఎలా అమ్ముడుపొయ్యాయో చూశాము. ఇప్పుడు ఇంకా రిలీజ్ కానీ జియో ఫోన్ మోడల్ కోసం అప్పుడే ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. స్మార్ట్ఫోన్లలో ఎక్కువ ఫీచర్స్ కలిగి అతి తక్కువ ధరకే లభ్యమయ్యే ఈ ఫోన్ గురించి జియో భాగస్వామి డిక్సన్ టెక్నాలజీస్ ఏమి చెప్పిందో తెలుసుకుందాం.
ఈ జియో ఫోన్ 3 మోడల్ లో ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టంని వాడారు. అలాగే యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ గో ఉంటుంది. ఈ డ్యూయల్ సిమ్ జియో ఫోన్ లో రెండూ జియో సిమ్ముల్నే వాడాలి. ఈ ఫోన్ 4G(వోల్ట్), 3G, 2G నెట్ వర్క్స్ ని సపోర్ట్ చేస్తుంది.
జియో టచ్ ఫోన్ లో స్క్రీన్ డిస్ప్లే
ఈ జియో టచ్ ఫోన్ స్క్రీన్ సైజు 5 అంగుళాలు. ఈ జియో ఫోన్ లో స్క్రీన్ పూర్తిగా హెచ్డి క్లారిటీ తో కూడిన ఎల్సీడి డిస్ప్లే ఉంటుంది. మల్టీ టచ్ ఆప్షన్ కలిగిన స్క్రీన్ పిక్సల్ డెన్సిటీ 294 ppi ఉంటుంది.
పెర్ఫార్మెన్స్ మరియు మెమరీ
ఈ ఫోన్ లో మీడియా టెక్ చిప్సెట్ ఉంటుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జిబి ర్యామ్ లతో పెర్ఫార్మెన్స్ సాఫీగా సాగుతుంది. అలాగే 64 GB ఇంటర్నల్ మెమరీ, 128 GB వరకు ఎక్స్పాండబుల్ మెమరీ దీని ప్రత్యేకత.
కెమెరా మరియు బ్యాటరీ
కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా 5 ఎంపీ రెజల్యూషన్, ఎల్ఈడి ఫ్లాష్ మరియు డిజిటల్ జూమ్ కలిగి ఉంటుంది. అలాగే ఫ్రంట్ కెమెరా రెజల్యూషన్ 2 మెగాపిక్సెల్స్. అలాగే బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 2800 mAh.
ఇవే కాకుండా ఇంకా కామన్ ఫీచర్లు అయిన వైఫై, మొబైల్ హాట్ స్పాట్, జిపిఆర్ఎస్, బ్లూటూత్, జిపిఎస్, యూఎస్బీ కనెక్టివిటీ, 3.5 mm ఆడియో జాక్, లౌడ్ స్పీకర్, ఆక్సెల్లరో మీటర్ లాంటివి అన్ని ఉన్నాయి.

జియో ఫోన్ 3 ఆన్లైన్ బుకింగ్, ఇతర ప్రశ్నలు జవాబులు:
ప్రశ్న | జియో ఫోన్ 3 ఎప్పుడు వస్తుంది? జియో ఫోన్ రిలీజ్ (లాంచ్) డేట్ ఎప్పుడు? |
జవాబు | జియో కంపెనీ వాళ్ళు ఇంకా అధికారికంగా ఏ రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. |
ప్రశ్న | ఫోన్ రేట్ ఎంత ఉంటుంది? |
జవాఋ | 64 GB మెమరీ (బేసిక్) ఫోన్ ధర 2999 రూపాయలు. [మెమరీ మార్పులతో 1999₹ నుంచి 4500₹ లో] |
ప్రశ్న | ఫోన్లో ఎయిర్ టెల్, ఐడియా సిమ్ లు వాడొచ్చా? |
జవాఋ | వాడలేము. జియో ఫోన్లో జియో సిమ్ ని మాత్రమే వాడగలము. |
ప్రశ్న | పబ్ జి గేమ్ ఆడొచ్చా? |
జవాఋ | పబ్ జి గేమ్ ఆడలేము, ఎందుకంటే ర్యామ్ కెపాసిటీ 2 GB సరిపోదు. |
ప్రశ్న | ఫోన్ ఎలా కొనాలి? జియో ఫోన్ 3 ఆన్లైన్లో బుకింగ్ ఎలా చేసుకోవాలి? |
జవాఋ | ప్రీ బుకింగ్ రోజున jio.com వెబ్ సైట్ లేదా జియో మార్ట్ ఆప్ లో మాత్రమే మీ డీటైల్స్ నింపి, డబ్బు కట్టి బుకింగ్ చేసుకోవాలి. |
ప్రశ్న | ఫోటోల క్వాలిటీ ఎన్ని పిక్సెల్స్ ఉంటుంది? |
జవాఋ | 2592 x 1944 pixels |
ప్రశ్న | వీడియో కాల్స్ చేసుకోగలమా? |
జవాఋ | వీడియో కాల్స్ చేసుకోవచ్చు. VoLTE ☑️ |
ప్రశ్న | అమేజాన్, ఫ్లిప్ కార్ట్ లో ఆన్లైన్ బుకింగ్ చేసుకోగలమా? |
జవాఋ | ఇకపై రిలయన్స్ కంపెనీకి సంబంధించిన అన్ని ఉత్పత్తులు జియో మార్ట్ ఆప్ లో బుకింగ్ చేసుకోవాలి. |
ప్రశ్న | ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉందా? |
జవాఋ | ❎ లేదు |