You are currently viewing రంజిత్ సిన్హ్ డిసాలే – గ్లోబల్ టీచర్ ప్రైజ్ విజేత

రంజిత్ సిన్హ్ డిసాలే – గ్లోబల్ టీచర్ ప్రైజ్ విజేత

గ్లోబల్ టీచర్ ప్రైజ్ – మొత్తం 140 దేశాలనుండి 1200 మంది ఉత్తమ ఉపాధ్యాయులు నామినేట్ అయ్యారు. ఆ 1200 మందిని అంచెలంచెలుగా ఫిల్టర్ చేయగా ఫైనల్లో 10 మంది మిగిలారు. ఆ పదిమందిలో విజేతగా నిలిచాడు రంజిత్ సిన్హ్ డిసాలే. కారణం పరిటేవాడి అనే గ్రామంలోని విద్యా వ్యవస్థలో రంజిత్ చేసిన సమూల మార్పులు, విశేష కృషి.

రంజిత్ సిన్హ్ డిసాలే విద్యాభ్యాసం

రంజిత్ సిన్హ్ డిసాలే మహారాష్ట్రలో ఆగస్టు 5, 1988 న జన్మించాడు. చాలా మంది యువకుల్లాగే రంజిత్ కూడా ఇంజనీరింగ్ చదువుకొని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలని కలలు కనేవాడు. కానీ ఇంట్లో పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకోవాలన్న ఆశ కలగానే మిగిలిపోయింది. తండ్రి బలవంత పెట్టడంతో టీచర్స్ ట్రైనింగ్ కాలేజీలో చేరాడు. ప్రస్తుత సమాజంలో అసలైన మార్పు టీచర్ల ద్వారా వస్తుందని రంజిత్ కు ఆ కాలేజీలో అర్థం అయ్యింది. మన భారతీయ విద్యావ్యవస్థలో చాలా మార్పులు రావాలని బలంగా నమ్మేవాడు రంజిత్.

ఒక టీచర్ గా పరిటేవాడిలో రంజిత్ సిన్హ్ డిసాలే చేసిన కృషి

తన చదువు అనంతరం 2009లో సోలాపూర్ జిల్లా పరిటేవాడిలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా రంజిత్ ఉద్యోగం సంపాదించాడు. ఆ పాఠశాల చూస్తే పూర్తిగా పాడుబడిన భవంతి. కొందరు గ్రామస్తులు పాఠశాలలోని కొన్ని గదులను గొడ్లచావడి లాగ వాడేవారు. బాలికలు ఎవరు పాఠశాల ముఖం చూసేవారు కాదు. ఆ గ్రామంలో బాలికలకు ఎక్కువగా బాల్య వివాహం చేసేవారు. రంజిత్ గ్రామస్తులందరితోను బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు వివరించి, బాల్య వివాహాలను నిర్మూలించ సాగాడు. ఎట్టకేలకు కొందరు గ్రామస్తులు తమ పిల్లలను పాఠశాలకు పంపించేందుకు సిద్ధమయ్యారు.

అయితే రంజిత్ కు కొత్త చిక్కు భాష రూపంలో వచ్చింది. కారణం, పిల్లలు మరాఠీ చదవలేకపోవడం, రాయలేకపోవడం. అక్కడున్న గ్రామస్తులు ఎక్కువగా కన్నడిగులు. రంజిత్ అదేపనిగా కన్నడ నేర్చుకుని పాఠ్యపుస్తకాలను మరాఠీ నుంచి కన్నడలోకి అనువదించాడు. అలాగే పాఠాలను ఆడియో, వీడియో రూపంలోకి మార్చాడు. పుస్తకాలకు క్యూఆర్ కోడ్ పెట్టిన ఘనత కూడా రంజిత్ కే దక్కుతుంది. ఒక్కసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పూర్తి పాఠం వీడియో రూపంలో చూడవచ్చు. థియరీ చెబుతూనే వాటిని ప్రాక్టికల్ గా చేసి చూపించేందుకు తన ఇంటిని ఒక ప్రయోగశాల లాగా మార్చాడు. పిల్లలకు పాఠ్యాంశాలను ఆటలపాటల రూపంలో, వీడియో రూపంలో అందించడంతో పిల్లలు కూడా తమకు తెలియకుండానే విద్య పైన మక్కువ పెంచుకున్నారు. ఇప్పుడు ఆ ఊరిలో 100 శాతం మంది బాలికలు పాఠశాలకు వెళుతున్నారు. అలాగే ఆ గ్రామంలో బాల్య వివాహాల ఊసే లేకుండా చేసాడు రంజిత్ సిన్హ్ డిసాలే.

రంజిత్ కు వచ్చిన అవార్డులు

అవార్డు పేరుబహుకరించినవారు
ఇన్నొవేటివ్ రీసెర్చర్ ఆఫ్ ద ఇయర్ [2016]భారత ప్రభుత్వం
ఇన్నొవేటర్ ఆఫ్ ద ఇయర్ [2018]నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్
గ్లోబల్ టీచర్ ప్రైజ్ [2020]వార్కీ ఫౌండేషన్ (యునెస్కో సహకారంతో)
రంజిత్ సిన్హ్ డిసాలే కి వచ్చిన అవార్డుల పూర్తి వివరాలు

రంజిత్ సిన్హ్ డిసాలే విజేత అయిన వేల

Leave a Reply