మన జీవితం లో ఎన్నో కొటేషన్స్ వింటూ ఉంటాం. వాటిలో చాలా రకాలు ఉంటాయి. కాని కొన్ని కొటేషన్స్ మనల్ని ప్రభావితం చేసి మన జీవితాన్ని మార్చేయగలవు. అలాంటి 20 ఇన్స్పిరేషనల్ తెలుగు కోట్స్ మీకోసం.
ఈ నాలుగు విషయాల గురించి ఎప్పుడూ సిగ్గు పడకండి…..
(1) మాసిన బట్టలు
(2) ముసలి తల్లిదండ్రులు
(3) పేద స్నేహితులు
(4) నిరాడంబర జీవితం
జ్ఞానం అనేది ప్రవహించే పాదరసం లాంటిది,
ఆగిన ప్రతిచోటా ఇదే స్థిరత్వం అనుకుంటుంది.
అందరినీ ప్రేమించండి, కాని కొద్దిమందినే నమ్మకోండి.
అందరు నిజమే, కానీ ప్రతి ఒక్కరు సత్యవంతులు కాదు.
ఇతరుల విషయాలను పట్టించుకోక పోవడం కంటే, గొప్పదైన ప్రశాంతత జీవితంలో మరొకటి లేదు.
మీ బలహీనతను ఎప్పటికీ బయట పెట్టుకోకండి,
దాని తో ఆడుకోవడం సమాజానికి చాలా సరదా.
క్షమాపణ అడిగిన వాడు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఓడిపోతాడు,
కాని అసలు క్షమాపణ అడగనివాడు జీవితాంతం ఓడిపోతాడు.
మనసును పచ్చటి చెట్టు లాగా మలచుకోండి,
కోకిల దానంతట అదే వచ్చి పాడుతుంది.
ఒకసారి మీ స్నేహం వద్దు అనుకుని గెంటేసిన వారిని,
మీ జీవితంలో మళ్లీ ఎప్పుడు వాళ్ళని కలుసుకోకండి.
భావోద్వేగాలు అనేవి బంధువుల లాంటివి వస్తుంటారు, పోతుంటారు… పట్టించుకోవలసిన అవసరం లేదు.
ఒకరి అభిప్రాయాన్ని తప్పని ఎప్పుడు చెప్పకండి
కాలాన్ని బట్టి తప్పులు ఒప్పులు గా మారుతాయి
ఒక చెట్టు పెరగాలంటే ఎండా, వాన రెండు కావాలి
అలాగే ఓ మనిషి ఎదగాలంటే జీవితంలో కష్టం, సుఖం రెండు భరించాలి
ఆవేదన మిమ్మల్ని పట్టించుకోలేదు
మీరే ఆవేదనను పట్టుకున్నారు
కారణం లేకుండా ప్రేమిస్తే
కారణం లేకుండానే వదిలేస్తారు
ఇతరులు వ్యక్తిత్వం గురించి తీర్పు చెప్పకండి
ఎవరి జీవిత కథ వారికు ఉంటుంది
అది మంచిదే కావచ్చు లేదా చెడ్డది కావచ్చు
మీరు దేని గురించి బాధ పడ్డారో అసలు గుర్తుకు రానప్పుడు
మీ మనసుకు తగిలిన గాయం నయం అయిపోయినట్లే
కొంతకాలానికి గొడవలు సద్దు మణిగి పోవచ్చు
కానీ పలికిన పరుష పదాలు చిరకాలం గుర్తుండి పోతాయి.
పెరుగుతున్న చెట్టు శబ్దం చేయదు, కూలిపోతున్న చెట్టు శబ్దం చేస్తుంది, మనిషి ఎదుగుదల కూడా అంతే.
కాళ్లు లేని వ్యక్తిని కలిసేంత వరకు మనకు చెప్పులు లేవు అని దేవుడు ని నిందిస్తాము,
కలిశాక మనకు కాళ్లు ఉన్నాయి కదా చాలు అని అదే దేవుడిని పూజిస్తాము.
అవసరం లేనప్పుడు బంగారం ఇవ్వడం కంటే,
అవసరం ఉన్నప్పుడు ఇటుకరాయి ఇవ్వడం మేలు.
ఎక్కడైతే నీరు ప్రవహించకుండా నిలువ ఉంటుందో, అక్కడ నీరు చెడిపోతుంది.
అలాగే ఎప్పుడైతే మనం కొత్త విషయాలను తెలుసుకోవడం మానేస్తామో, అప్పుడు మన జ్ఞానం మసకబారుతుంది.