You are currently viewing GHMC ఎన్నికల ఫలితాలు – ఏఎస్ రావు నగర్ పూర్తి వివరాలు

GHMC ఎన్నికల ఫలితాలు – ఏఎస్ రావు నగర్ పూర్తి వివరాలు

GHMC ఎన్నికల ఫలితాలు: ఎఎస్ రావు నగర్ లో పోలైన ఓట్లు, మెజారిటీ మరియు ఇతర పూర్తి వివరాలు అందిస్తున్నాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన సింగిరెడ్డి శిరిషా రెడ్డి చేతిలో భాజపా పార్టీకి మేడూరి చంద్రిక 4396 ఓట్ల తేడాతో భారీ ఓటమి చవి చూసారు.

గెలుపు – శిరిషా రెడ్డి సింగిరెడ్డి (కాంగ్రెస్) – 9043 ఓట్లు

ఓటమి – చంద్రిక మేడూరి (భాజపా) – 4647 ఓట్లు

మెజారిటీ – 4396 ఓట్లు

GHMC ఎన్నికల ఫలితాలు – ఏఎస్ రావు నగర్ లో పోలైన పూర్తి ఓట్ల వివరాలు

పూర్తి ఓటర్ల సంఖ్య41,691
పోలైన ఓట్లు 19,335
చెల్లిన ఓట్లు18,971
తిరస్కరించబడిన ఓట్లు198
నోటా ఓట్లు166
ఓటింగ్ శాతం46.4%
A S Rao Nagar – GHMC Elections 2020 Statistics
GHMC ఎన్నికల ఫలితాలు - ఏఎస్ రావు నగర్
A S Rao Nagar – GHMC ఎన్నికల ఫలితాలు, మెజారిటీ

ఏఎస్ రావు నగర్ ఎన్నికల హైలైట్స్:

  • కాంగ్రెస్ గెలిచిన 2 స్థానాల్లో A S Rao Nagar ఒకటి. ఈ స్థానం మహిళలకు రిజర్వ్ కావడంతో, ఇక్కడి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా సింగిరెడ్డి సోమశేఖర రెడ్డి భార్య శిరిషా రెడ్డికి టికెట్ లభించింది. ఎవరూ ఊహించని విధంగా శిరిషా రెడ్డి భారీ విజయం సాధించారు.
  • శిరిషా రెడ్డి భారతీయ జనతా పార్టీకి చెందిన మేడూరి చంద్రిక పైన 4396 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. శిరిషా రెడ్డి 9043 ఓట్లతో మొదటి స్థానంలో నిలబడగా, మేడూరి చంద్రిక 4647 ఓట్లతో రెండవ స్థానంలో నిలబడ్డారు.
  • తెరాస సిట్టింగ్ కార్పొరేటర్ అయిన పావని మణిపాల్ రెడ్డి 4513 ఓట్లతో మూడవ స్థానానికి పరిమితమయ్యారు.
  • టిడిపి తరుపున పోటీ చేసిన నిర్మల కేవలం 738 ఓట్లతో నాలుగవ స్థానంలో నిలిచారు. ఇక్కడ కూడా టిడిపి డిపాజిట్ గల్లంతయ్యింది.
  • అలాగే TJSP తరుపున పోటీ చేసిన అర్చన బద్రగామ కు కేవలం 19 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
  • A S Rao Nagar లో శిరిషా రెడ్డి, ఆమె భర్త సింగిరెడ్డి సోమశేఖర రెడ్డికి మంచి పేరు ఉంది. కరోనా సమయంలో వీళ్లు చేసిన పలు సేవా కార్యక్రమాల వల్లనే పార్టీలకు అతీతంగా వీరి కుటుంబానికి ఓటర్లు పట్టం కట్టారు.
  • అలాగే శిరిషా రెడ్డి విజయానికి సీతక్క చేసిన ప్రచారం కూడా దోహద పడింది.
అభ్యర్థి పేరుపార్టిపోలైన ఓట్లు
శిరిషా రెడ్డి సింగిరెడ్డికాంగ్రెస్9043
చంద్రిక మేడూరిభాజపా4647
పావని మణిపాల్ రెడ్డితెరాస4513
డి. నిర్మలటిడిపి738
అర్చన బద్రగామటిజేఎస్పి19
వి. పుష్ప లతాఇండిపెండెంట్11
A S Rao Nagar GHMC ఎన్నికల ఫలితాలు, పూర్తి వివరాలు

గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ అతి దారుణమైన ప్రదర్శన కనబరిచింది. ఈ ఎన్నికల ఫలితాలతో ఇక దాదాపుగా తెలంగాణాలో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమని భావిస్తున్నారు విశ్లేషకులు.

Leave a Reply