భారతీయులు అత్యంత ఆనందంగా మరియు ఆడంబరముగా జరుపుకొనే పండుగలలో దీపావళి ముఖ్యమైనది. దీపావళిని “ఫెస్టివల్ ఆఫ్ లైట్స్” అని కూడా పిలుస్తారు. చెడు పై విజయం సాధించినందుకు (చీకటి పై కాంతి) చిహ్నంగా ప్రజలు తమ ఇళ్లల్లో దీపాలను వెలిగించి పండుగను జరుపుకుంటారు. దీపావళి పండుగ రోజుల్లో లక్ష్మీ దేవి దీపాలతో కలకలలాడుతున్న ఇళ్లల్లోకి వెళ్లి ఆతిథ్యము స్వీకరించి, వారికి సిరి సంపదలు కలిగేలా ఆశీర్వదిస్తుందని నానుడి.
దీపావళి [2020] పండుగ తేదీలు – Deepavali [2020] Dates
దక్షిణ భారతదేశంలో దీపావళి పండుగను కేవలం రెండు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు నరక చతుర్దశి మరియు రెండవ రోజు లక్ష్మీ పూజ చేసుకుంటారు. కానీ ఉత్తర భారతదేశంలో దీపావళి పండుగను 5 రోజులు జరుపుకుంటారు.
S.No | డేట్స్ Deepavali Date | దీపావళి పండుగ రోజులు – పూజలు |
1 | నవంబర్ 12 | దంతేరాస్ |
2 | నవంబర్ 13 | నరక చతుర్దశి |
3 | నవంబర్ 14 | లక్ష్మీ పూజ / కాళి మాత పూజ |
4 | నవంబర్ 15 | గోవర్ధన పూజ / బలి పాడ్యమి |
5 | నవంబర్ 16 | విశ్వకర్మ పూజ / భాయ్ దూజ్ |