Ajwain in Telugu Language – అజ్వైన్/ అజ్వాయిం ఇన్ తెలుగు: Ajwain (అజ్వైన్, అజ్వాయిం, అజ్వాయిన్) ని వాము, వోముు, ఓమ అని పిలుస్తారు. తెలుగు వారికే కాక భారతీయులకు అందరికీ అజ్వైన్ గురించి ఇంకా కన్ఫ్యూజన్ నెలకొనే ఉంది. రెండు రకాల మొక్కలను మనము వాము అని పిలవడమే ఈ గందరగోళానికి కారణం.
వాము గురించి చర్చ వచ్చినప్పుడు, అది ఆకుల విషయంలోనా లేక గింజల (విత్తనాల) విషయంలోనా అనేది తప్పనిసరిగా చూసుకోవాలి. ఎందుకంటే ఆకులు ఒక మొక్కవైతే, వాము గింజలు (విత్తనాలు) మరొక మొక్కవి. ఇక్కడ క్రింద 1వ భాగం లో వాము అంటే వాము ఆకుల మొక్క గురించి మాత్రమే అని చదువుకోగలరు. అలాగే 2వ భాగంలో వాము అంటే వాము గింజల గురించి మాత్రమే అని చదువుకోగలరు.
(1) Ajwain Leaves Plant (Oregano Plant) Details In Telugu – వాము ఆకుల మొక్క

వాము (ఆకుల) మొక్క అని మనము ఇప్పుడు పిలుచుకునే మొక్క అసలు పేరు కర్పూర వల్లి. కర్పూర వల్లి మొక్క సువాసన వాము గింజల నుండి వచ్చే వాసనను పోలి ఉంటుంది. ఒకే రకమైన సుగంధ వాసన వలన బహుశా కర్పూర వల్లి మొక్కలను వాము మొక్కలు అని పిలుస్తుంటారు.
భారతదేశంలో తప్పితే మిగతా దేశాల్లో పై చిత్రంలో ఉన్న మొక్కను ఓరెగానో ప్లాంట్ (Oregano plant) అని పిలుస్తారు. ఈ ఒరెగానో మొక్కని కర్పూర వల్లి, పర్నేయ వాణి అని ఇప్పటికీ తెలుగు పుస్తకాల్లో, వెబ్ సైట్లలో పొందుపరచటం జరుగుతోంది. కర్పూర వల్లి, పర్నేయ వాణి అని పుస్తకాల్లో లిఖించినా, వాడుక భాషలో మాత్రం వాము (మొక్క, ఆకులు) అని పిలుస్తున్నారు.
ఈ వాము ఆకులను, వాటి పొడిని, రసాన్ని చాలా వరకు వంట, ఆరోగ్య సంబంధిత విషయాల్లో వాడుతుంటారు. వీటిని కొందరు ఆరోగ్య ప్రయోజనాల కోసం పెంచుకుంటే, మరికొందరు అలంకరణ కోసం, సుగంధ వాసన కోసం పెంచుకుంటుంటారు. వాము ఆకులు రుచిలో కొద్దిగా వగరుగా, ఘాటుగా ఉంటాయి. వీటి వలన ఏమంత దుష్పరిణామాలు ఉండవు. ఎక్కువగా భోజనం తరువాత రెండు మూడు ఆకులను తింటుంటారు. వాము మొక్క కొమ్మ నుంచి పెరుగుతుంది. వాము మొక్కకు తెల్లటి పూలు పూస్తాయి.
(2) Ajwain Seeds Or Carom Seeds In Telugu Language – వాము గింజలు

Ajwain Seeds లేదా Carom Seeds (అజ్వైన్ సీడ్స్) ని తెలుగులో వాము గింజలు, వాము విత్తనాలు అని అంటారు. వాము గింజలు మన భారతీయ మసాలా దినుసులలో ఒకటి. వాము మొక్కల్లో థైమోల్ రసాయనం ఉంటుంది. వాము మంచి సువాసన కలిగి ఉంటుంది.

ఈ క్రింది వీడియోలో వాము గింజల మొక్క ఎలా ఉంటుందో, గింజలు ఎలా వస్తాయో క్లియర్ గా మరియు కరెక్ట్ గా చూపించారు.
Benefits of Ajwain Seeds In Telugu – వాము గింజల ఉపయోగాలు
వాములో ఔషధ గుణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. మన పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాల నుండి వామును జీర్ణ వ్యవస్థ కి సంబంధించిన సమస్యల్ని తగ్గించేందుకు ఉపయోగించేవారు. వాము అసిడిటీ, గ్యాస్ట్రిక్, అల్సర్ మరియు కడుపు నొప్పి వంటి సమస్యలను సులభంగా తగ్గిస్తుంది. వాము నీరు త్రాగడం వల్ల పిల్లలకు పాలిచ్చే తల్లులు తమ స్థనాల్లో పాల ఉత్పత్తి మోతాదును పెంచుకోవచ్చు. అధిక బరువు తగ్గేందుకు కూడా వాము ఉపకరిస్తుంది.
వాము ఆకుల మొక్కను కర్పూర వల్లి అనే పాత పేరుతో పిలుచుకుంటే ఈ గందరగోళం తగ్గుతుంది.