భాజపాకు 24 వార్డుల్లో డిపాజిట్లు గల్లంతు. అత్యల్ప ఓట్లు 96, 99, 247, 268..

భాజపాకు 24 వార్డుల్లో డిపాజిట్లు గల్లంతు. అత్యల్ప ఓట్లు 96, 99, 247, 268..

భాజపా మొత్తం 24 వార్డుల్లో డిపాజిట్లు కోల్పోయింది. భాజపా గ్రేటర్ ఎన్నికల్లో చాలా వార్డుల్లో తన సత్తాను బాగా కనబరచిన ఓల్డ్ సిటీలో మాత్రము పేలవమైన ప్రదర్శన కనబరిచింది. వీటిలో కొన్ని వార్డుల్లో అయితే మరీ దారుణంగా 96 ఓట్లు, 99 ఓట్లు తెచ్చుకుంది. మరో పది వార్డుల్లో అయితే 1000 ఓట్లలోపు తెచ్చుకొంది.

మొత్తం పోలైన ఓట్లలో ఆరవ వంతు కన్నా తక్కువ ఓట్లు వస్తే డిపాజిట్లు గల్లంతు అయినట్టు. ఈ 24 వార్డుల్లో 23 వార్డులు పాతబస్తీ లోనివి. మిగిలిన ఒక్క వార్డు గాజులరామారం. భాజపా డిపాజిట్లు కోల్పోయిన వార్డులు, ఓట్ల వివరాలు ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

వార్డు పేరుభాజపాకు పోలైన ఓట్లు
జహానుమా96
ఫలక్ నామా99
కంచన్ బాగ్247
రెయిన్ బజార్268
చవ్ని (చవని) 346
తలాబ్ చంచలమ్385
టోలిచౌక్392
రమనాసత్ పురా507
సులేమాన్ నగర్555
శాస్ర్తి నగర్578
నానాల్ నగర్646
సంతోష్ నగర్880
బర్కాస్ 1163
రియాసత్ నగర్1202
ఫతేర్ గట్టి1404
గోల్కొండ1641
మెహదీపట్నం1936
దత్తాత్రేయ నగర్1940
కిషన్ బాగ్2136
ఆజంపురా2240
చాంద్రాయణ గుట్ట2419
డబీర్ పురా2575
అహ్మద్ నగర్2964
గాజుల రామారం4531
గ్రేటర్ ఎన్నికల్లో భాజపా డిపాజిట్లు కోల్పోయిన 24 వార్డుల ఓట్ల వివరాలు
  • మెహదీపట్నంలో భాజపా అభ్యర్థి రెండవ స్థానంలో నిలిచినా, కేవలం 7 ఓట్ల తేడాతో డిపాజిట్లు కోల్పోయాడు.
  • గాజుల రామారంలో 31 వేలపైన ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ తెరాస, కాంగ్రెస్ అభ్యర్థులు మధ్య పోటీ తీవ్రంగా జరిగింది. భాజపా అభ్యర్థికి 4531 ఓట్లు వచ్చినా డిపాజిట్లు కోల్పోవలసి వచ్చింది.
  • ఆజంపురా, చవిని వార్డుల్లో ఏఐఎంఐఎం గెలవగా, రెండవ స్థానంలో ఇండిపెండెంట్లు నిలిచారు.
  • పాత బస్తీలో కొన్ని చోట్ల తెరాస కూడా డిపాజిట్లు కోల్పోవలసి వచ్చింది. ఇక కాంగ్రెస్, తెదేపా గురించి చెప్పనవసరం లేదు.

మొత్తానికి పాతబస్తీని భాజపా ఎంత టార్గెట్ చేసినా, ఏఐఎంఐఎం పార్టీ ఓటు బ్యాంకు ముందు భాజపా డిపాజిట్లు కోల్పోవలసి వచ్చింది. అయితే ఆ దూకుడు వల్ల గ్రేటర్ హైదరాబాద్ లోని ఇతర వార్డుల్లో తన ఓటు బ్యాంకును భాజపా బాగానే పెంచుకుంది.