Deserve Meaning in Telugu: ఈ పోస్ట్ లో deserve, deserves, deserved, deserving పదాల అర్థం తో పాటు ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో ఉదాహరణలతో ఇవ్వడం జరిగింది.
(1) Deserve Meaning In Telugu – Deserve అర్థం తెలుగులో
Deserve Meaning In Telugu= అర్హత గల వారు, అర్హులు, అర్హుడిని, అర్హుడవు.
మనము బహువచన పదాలలో Deserve ని వాడాలి. అలాగే I, you ప్రక్కన ఏకవచనం గా కూడా వాడతాము. ఇక్కడ Deserve = be worthy అని ఇంగ్లీషులో అర్థం.
English | They deserve to win the game. |
తెలగు అర్థం | ఆట గెలిచేందుకు వారు అర్హులు. |
English | You deserve a promotion in this year. |
తెలగు అర్థం | ఈ సంవత్సరం లో పదోన్నతి పొందేందుకు నువ్వు అర్హుడివి. |
English | I deserve 40000 rupees for this work. |
తెలగు అర్థం | ఈ పనికి 40000 రూపాయలు పొందేందుకు నేను అర్హుడిని. |

(2) Deserves Meaning In Telugu – Deserves అర్థం తెలుగులో
Deserves Meaning In Telugu= అర్హత గల వాడు, అర్హత గల ఆమె, అర్హత గలది, అర్హుడు, అర్హురాలు.
ఇక్కడ Deserves అనే పదం కేవలం he, she, it వంటి ఏకవచన పదాల ప్రక్కనే వాడాలి.
English | He deserves it. |
తెలుగు అర్థం | దానికి అతడు అర్హత గల వాడు. దానికి అతడు అర్హుడు. |
English | She deserves it. |
తెలుగు అర్థం | దానికి ఆమె అర్హత గలది. |
English | Raja deserves it. |
తెలగు అర్థం | దానికి రాజా అర్హుడు. |
Most commonly used Deserve Tenses
Deserve (present tense) పూర్తి Tenses list కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.
(3) Deserved Meaning In Telugu – Deserved అర్థం తెలుగులో
Deserved అనే పదం deserve యొక్క పాస్ట్ టెన్స్ పదం మాత్రమే. అంటే గతంలో అర్హత కలిగి ఉండెను అని అర్థం వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అర్హత లేదని గమనించాలి.
Deserved Meaning In Telugu= అర్హత కలిగి ఉండెను (గతంలో)
English | He once deserved this job, but not now. |
తెలుగు | అతను ఒకప్పుడు ఈ ఉద్యోగానికి అర్హుడు, కానీ ఇప్పుడు కాదు. |
(4) Deserving Meaning in Telugu Language – Deserving అర్థం తెలుగులో
Deserving అనేది కేవలం deserve యొక్క ప్రజెంట్ పార్టిసిపుల్. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అర్హత కలిగి ఉన్నారని చెప్పే సందర్భంలో డిసర్వింగ్ పదాన్ని వాడతారు.
Deserving Meaning In Telugu = అర్హత కలిగి ఉన్నారు
English | He is a deserving candidate for that villian role. |
తెలుగు | అతను ఆ విలన్ పాత్రకు అర్హత కలిగిన వ్యక్తి. |
ఇవే కాకుండా గూగుల్ లో Deserve కి సంబంధించి ఎక్కువగా వెతుకుతున్న ప్రశ్నలు (FAQs) కింద చూద్దాం.
(1) You deserve it meaning in Telugu:
You deserve it = నువ్వు దానికి అర్హుడివి, నువ్వు అందుకు అర్హుడివి

(2) U deserve it meaning:
U deserve it = నువ్వు దానికి అర్హుడివి, నువ్వు అందుకు అర్హుడివి
English | When you care for someone more than they deserve, you get hurt more than you deserve. |
తెలుగు | అర్హత లేని వ్యక్తుల కోసం నువ్వు ఎంత ప్రాకులాడితే, అర్హతకు మించిన బాధను నువ్వు అనుభవించవలసి వస్తుంది. |
(3) Don’t deserve it meaning in Telugu
Don’t deserve it = అందుకు అర్హత లేదు, దానికి అర్హత కాదు
(4) I don’t deserve it:
I don’t deserve it = అందుకు నాకు అర్హత లేదు, దానికి నాకు అర్హత లేదు.
(5) You get what you deserve meaning:
You get what you deserve = నువ్వు దేనికైతే అర్హుడవో, నీకు అదే లభిస్తుంది.
(6) He doesn’t deserve me:
He doesn’t deserve me = నన్ను పొందేందుకు అతడు అర్హుడు కాదు.
(7) You don’t deserve me:
You don’t deserve me = నన్ను పొందేందుకు నువ్వు అర్హుడవు కాదు.
“Meaning In Telugu” Tag
కొన్ని ఆంగ్ల భాష పదాలకు మనకు అర్థం తెలియక గూగుల్ లో వెతికితే, కొంచెం గందరగోళంగా ఉండే సమాధానాలు దొరుకుతున్నాయి. అలాగే ఆ పదాలను ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలి అని సరిగ్గా విశ్లేషించకుండా వదిలేసి ఉంటారు. దీనికి ముఖ్య కారణం, ఆ వెబ్ సైట్లు కేవలం గూగుల్, ఇతర ట్రాన్స్లేటర్ల ద్వారా పదాలను ఇతర భాషల్లోకి ఆటోమేటిక్ గా ట్రాన్స్లేట్ చేయడం ద్వారా తప్పిదాలు దొర్లుతుంటాయి. అందుకే ఆ తప్పిదాలు లేకుండా “Meaning in Telugu” ట్యాగ్ క్రింద మంచి ఉదాహరణలతో ఎప్పుడు, ఎక్కడ వాడాలో అందరికీ అర్థమయ్యేలా అందిస్తున్నాము.