You are currently viewing Endurance Meaning In Telugu || ఎండ్యురెన్స్ అర్థం తెలుగులో

Endurance Meaning In Telugu || ఎండ్యురెన్స్ అర్థం తెలుగులో

ఎండ్యురెన్స్ అంటే తెలుగులో అర్ధం ఏమిటి? ఎండ్యురెన్స్ యొక్క పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు మరియు ఉదాహరణలను కూడా ఈ Endurance Meaning In Telugu పోస్టులో వివరించడం జరిగింది.

What Does Endurance Mean In Telugu || ఎండ్యురెన్స్ మీనింగ్ ఇన్ తెలుగు

Endurance (ఎండ్యురెన్స్) అంటే ఎంతటి కఠినమైన పరీక్ష నైనా చాలా కాలం పాటు ఎదుర్కొని నిలబడగలిగే సత్తా కలిగి ఉండడం అని అర్థం వస్తుంది. టూకీగా చెప్పాలంటే Endurance (ఎండ్యూరెన్స్) అంటే ఓర్పు, ఓపిక, సహనము కలిగి ఉండటం అని తెలుగులో అర్థం.

మనిషి కఠినమైన పరీక్షను ఎదుర్కొంటున్నప్పుడు తొలుత మానసికంగా కానీ లేదా శారీరకంగా కానీ నొప్పిని, బాధను అనుభవిస్తాడు. కాలక్రమేణా ఆ నొప్పిని లేదా బాధను దిగమింగుకొని కఠినమైన పరీక్షకు అలవాటు పడిపోతాడు. ఒక రకంగా చెప్పాలంటే విల్ పవర్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇలా బ్రతక గలరు. చాలామంది ఈ కఠినమైన పరీక్షను మొదట్లో స్వీకరించినా, తరువాత తమ వల్ల కాదని మధ్యలో వదిలేస్తారు. ఇలా ఓర్పు కోల్పోవడం, సహనం నశించడం వంటివి ఎండ్యురెన్స్ క్రిందికి రావు.

అలాగే Endurance పదానికి సంబంధించిన వివిధ రకాల పదాలు, వాటి అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం.

(1) Endurance Test Meaning In Telugu – ఎండ్యురెన్స్ టెస్ట్ మీనింగ్ ఇన్ తెలుగు

ఎండ్యురెన్స్ టెస్ట్ అంటే తెలుగులో ఓర్పును లేదా సహనాన్ని పరీక్షించడం అని అర్థం. ఎండ్యురెన్స్ టెస్ట్ అనే పదాన్ని ఎక్కువగా క్రీడల్లో, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ (వ్యాయామం) చేసే సందర్భంలో ఎక్కువగా వాడుతున్నారు.

(2) Gruelling Endurance Test Telugu Meaning – గౄఎలింగ్ ఎండ్యురెన్స్ అర్థం

Gruelling Endurance Test (గౄఎలింగ్ ఎండ్యురెన్స్ టెస్ట్) అంటే మనిషి యొక్క ఓర్పును కఠినమైన పద్దతుల్లో పరీక్షించుట అని అర్థం. గౄఎలింగ్ ఎండ్యురెన్స్ టెస్టును తెలుగులో చిన్నపాటి అగ్నిపరీక్ష తో పోల్చుకోవచ్చు.

ఈ గౄఎలింగ్ ఎండ్యురెన్స్ పరీక్ష చాలా కఠోరమైనదని, ఓర్పును కోల్పోయే అవకాశాలు పుష్కలంగానే ఉంటాయని గ్రహించాలి. అయితే గౄఎలింగ్ ఎండ్యురెన్స్ టెస్టు అనే పదాన్ని ఎక్కువగా శారీరక శ్రమను తెలియజేశే క్రమంలో వాడుతారు. మానసిక ఒత్తిడిని తెలిపేందుకు ఈ పదాన్ని వాడరాదు.

ఈ పదాన్ని ఎక్కువగా కఠినమైన మిలిటరీ ట్రైనింగ్, ఏరోబిక్ ఎక్సర్సైజెస్, స్పోర్ట్స్ ట్రైనింగ్, హమాలీ పనితనం మొదలైన శారీరక శ్రమను తెలియజేశే క్రమంలో వాడుతారు.

Endurance Synonyms In Telugu – ఎండ్యురెన్స్ పర్యాయ పదాలు

ఎండ్యురెన్స్ కి సంబంధించిన ఇంగ్లీష్ పర్యాయ పదాలతో పాటు, వాటి యొక్క తెలుగు అర్థాలను కూడా ఇవ్వటం జరిగింది.

  • Toleration, tolerance = సహనం
  • Stamina = సత్తా, సత్తువ
  • Survive, survival = మనుగడ, బ్రతకనేర్చడం

Endurance Antonyms In Telugu – ఎండ్యురెన్స్ వ్యతిరేక పదాలు

ఎండ్యురెన్స్ పదానికి వ్యతిరేక అర్థం అంటే ఓర్పు, ఓపిక లేదా సహనం నశించడం వలన ముగింపు పలకడం. తెలుగులో ఎండ్యురెన్స్ కి వ్యతిరేకంగా విరమణ, నిష్క్రమణ, ముగింపు, రద్దు వంటి పదాలను సందర్భానుసారంగా ఉపయోగిస్తారు. అలాగే ఎండ్యురెన్స్ సంబంధించిన ఇంగ్లీష్ వ్యతిరేక పదాల జాబితాను క్రింద ఇవ్వబడింది.

  • Cessation = విరమణ, నిష్క్రమణ
  • Terminate, Termination = రద్దు
  • Finish = ముగింపు
  • End = ముగించుట

Leave a Reply