English And Telugu Words Related To Eating And Drinking

English And Telugu Words Related To Eating And Drinking

మనము పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు భోజనానికి సంబంధించిన కొన్ని క్రొత్త పదాలు వింటుంటాం. అలాగే తినే పద్దతిని, త్రాగే పద్దతిని బట్టి ఇంగ్లీషు లో మరియు తెలుగు లో కొన్ని పదాలను వాడుతుంటాము. తినడం మరియు త్రాగటానికి సంబంధించి 60 కి పైగా ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. కానీ తరుచుగా వాడే ఇంగ్లీష్ పదాలను మరియు వాటి తెలుగు అర్థాలను ఈ English And Telugu Words Related To Eating And Drinking పోస్టులో పొందుపరచటం జరిగింది.

Swallow Meaning In Telugu Language – స్వాలో మీనింగ్ ఇన్ తెలుగు

స్వాలో (swallow) అంటే తెలుగులో మ్రింగుట అని అర్థం. మాత్రలు, గుళికలు మొదలగు పదార్థాలను నమలకుండా మింగాలి.

Swallow Example With Telugu Meaning

The doctor told me to swallow this tablet after lunch – మధ్యాహ్నం భోజనం తర్వాత ఈ మాత్రను మింగాలని డాక్టర్ చెప్పాడు.

Chew Meaning In Telugu – చ్యూవ్ అర్థం తెలుగులో

చ్యూవ్ (chew) అంటే తెలుగులో నములుట అని అర్థం. మనము తినే ఆహార పదార్థాలలో చాలా వాటిని నమలాలి. బాగా నమిలితే జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.

Chew Example With Telugu Meaning

We should chew the food properly and then swallow it – మనము ఆహారాన్ని బాగా నమిలిన తరువాతే దానిని మ్రింగాలి.

Gnaw Meaning In Telugu – గ్నా మీనింగ్ ఇన్ తెలుగు

Gnaw (గ్నా) అంటే చాలా సేపు నములుతూ ఉండటం అని అర్థం.

Babies like to gnaw hard toys when they are teething. పళ్ళు వస్తున్న సమయంలో చిన్న పిల్లలకు గట్టి బొమ్మలను చాలా సేపు నములుతూ ఉండటం అంటే ఇష్టం.

Gargle Meaning In Telugu – గార్గల్ మీనింగ్ ఇన్ తెలుగు

గార్గల్ అంటే పుక్కలించుట అని అర్థం.

If your throat is soar, gargle with salt water. మీ గొంతు మంటగా ఉంటే, వేడి నీళ్లతో పుక్కలించండి.

Suck Meaning In Telugu Language – సక్ మీనింగ్ ఇన్ తెలుగు, సక్ అంటే ఏమిటి, సక్ అర్థం తెలుగులో

సక్ అనే పదానికి తెలుగులో చాలా పదాలు ఉన్నాయి. ఈ పదాన్ని చాలా సందర్భాల్లో వాడుతారు. ఇంచు మించు ఒకే రకమైన అర్థాన్ని కనబరచినా, సందర్భాన్ని బట్టి తెలుగులో పదాలు మారుతాయి. సక్ అంటే తెలుగులో నోటిలోనికి పీల్చడం, చప్పరించడం, జుర్రుకొనడం, చీకడం, కుడవడం (కుడుచుట, గుడవడం) అని అర్థాలు వస్తాయి. పీల్చడం, చప్పరించడం సాధారణంగా వాడే పదాలు. జుర్రుకొనడం అనే పదాన్ని ఎక్కువగా కవితల్లో, నవలల్లో వాడుతుంటారు. మిగిలిన పదాలను అశ్లీలతను తెలియజేసే సందర్భాల్లో వాడుతారు. అయితే సక్ అనే పదాన్ని ఇంగ్లీష్ లో స్లాంగ్ (బూతు, అశ్లీల) పదంగా వాడే సందర్భాలు అనేకం. అటువంటి అశ్లీల సందర్భాల్లో కుడవడం, చీకడం లాంటి తెలుగు పదాలను వాడుతారు. కావున ఈ పదం యొక్క అర్థం సందర్భాన్ని బట్టి గ్రహించగలగాలి.

Butterflies suck honey from the flowers. – సీతాకోకచిలుకలు పూల నుండి మకరందాన్ని (తేనె) పీల్చుకుంటాయి. సీతాకోకచిలుకలు పూల నుండి మకరందాన్ని (తేనె) జుర్రుకుంటాయి.