Executant పదం యొక్క అర్థంతో పాటు ఈ పదానికి సంబంధించిన వివరణ ఈ Executant Meaning In Telugu పోస్టులో ఇవ్వడం జరిగింది.
Executant Meaning In Telugu – ఎక్జిక్యుటంట్ అర్థం తెలుగులో
Executant అంటే పాత్రధారి, కార్య నిర్వాహకుడు, కార్యాన్ని జరిపించువాడు, కార్యాన్ని నెరవేర్చువాడు అని తెలుగులో అర్థం. ఇక్కడ పాత్రధారి (executant – ఎక్జిక్యుటంట్) ఏదైనా పనిని జరిపించడం లో తానే స్వయంగా పాల్గొంటాడు.

Executant అనే పదం గురించి మాట్లాడేటప్పుడు Executor అనే పదం గురించి కూడా మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.
Executor Meaning In Telugu – ఎక్జిక్యూటర్ అర్థం తెలుగులో
Executor అనే పదాన్ని సాధారణంగానే కాకుండా న్యాయ శాస్త్ర (LAW) సంబంధిత విషయాలలో వాడతాము. సాధారణంగా Executor అంటే తెలుగులో సూత్రధారి అని అర్థం. ఒక పనిని సజావుగా సాగేందుకు సూత్రధారి పైపైన పెత్తనం మాత్రమే చేస్తాడు. అసలు పని మాత్రం పాత్రధారులే చెయ్యాలి. అతను సలహాలు, సూచనలు ఇచ్చి పని పూర్తయ్యేందుకు వెనుక నుండి సహకరిస్తాడు. అందుకే ఇతన్ని సూత్రధారి అనేది.

Executor meaning Regarding Law – న్యాయశాస్త్రం ప్రకారం ఎక్జిక్యూటర్ అర్థం:
ఒక వ్యక్తి మరణానంతరం అతని ఆస్తిని వీలునామా ప్రకారం ఎవరికి, ఎప్పుడు, ఎలా, ఎంత చెందాలో అలా పంచే అతన్ని executor అంటారు.