Extrovert Meaning In Telugu Language – ఎక్సట్రావర్ట్ మీనింగ్ ఇన్ తెలుగు

Extrovert Meaning In Telugu Language – ఎక్సట్రావర్ట్ మీనింగ్ ఇన్ తెలుగు

Extrovert Meaning In Telugu Language – ఎక్సట్రావర్ట్ మీనింగ్ ఇన్ తెలుగు: ఆలోచనా సరళి ప్రకారం సైకాలజీలో మనుషులను మూడు రకాలుగా విభజించారు. ఆ మూడు రకాల వ్యక్తులను ఇంట్రావర్ట్స్, ఎక్సట్రావర్ట్స్ (ఎక్స్ట్రా వర్ట్స్) మరియు యాంబివర్ట్స్ అని అంటారు. ఎటువంటి వ్యక్తిని ఎక్సట్రావర్ట్ అని అంటారో ఈ Extrovert Meaning In Telugu పోస్టులో వివరించడం జరిగింది. ఈ పోస్టులో ఎక్సట్రావర్ట్స్ కి ఉండే లక్షణాలను కూడా తెలియజేయడం జరిగింది. మన తెలుగువారితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎక్సట్రావర్ట్ గా ముద్రపడిన ప్రముఖుల పేర్లను కూడా ఇవ్వడం జరిగింది.

Extrovert Meaning In Telugu – ఎక్సట్రావర్ట్ మీనింగ్ ఇన్ తెలుగు, ఎక్సట్రావర్ట్స్ అర్థం తెలుగులో

ఎక్స్ట్రావర్ట్ అంటే తెలుగులో బహిర్ముఖుడు అని అర్థం. బహిర్ముఖుడు అంటే తన ఆలోచనలను మరియు అంతరంగాన్ని ఇతరులతో పంచుకునే వ్యక్తి అని అర్థం. ఎక్సట్రావర్ట్స్ ఇతరులతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండడం వల్ల వీరిని తెలుగులో వాగుడు కాయ అని కూడా అంటారు. వీరికి సోషియలైజ్ (మందిలో కలవడం) అవ్వడం అంటే చాలా ఇష్టం. వీరు తమకు పరిచయం లేని వారితో కూడా మాటలు కలిపి గంటలు గంటలు మాట్లాడగలరు. ఎక్సట్రావర్ట్స్ వాగుడు కాయ కావడం వల్ల వీరికి స్నేహితులు చాలా మంది ఉంటారు.

Extrovert Characteristics In Telugu – ఎక్సట్రావర్ట్స్ లక్షణాలు

  • ఎక్సట్రావర్ట్స్ ఎక్కువగా సొంత ఆలోచనలు కలిగి ఉండరు. వీరు ప్రతి విషయాన్ని ఇతరులతో చర్చిస్తారు. వారు ఇచ్చే సలహాలను బేరీజు వేసుకుని ప్రవర్తిస్తుంటారు. అందువల్ల వీళు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆలస్యం చేస్తారు మరియు ఊగిసలాట ధోరణి కనబరుస్తారు.
  • ఎక్స్ట్రావర్ట్స్ ఎప్పుడూ గుంపులుగా ఉండేందుకు ఇష్టపడతారు. ఇలా గుంపులుగా ఏర్పడ్డం వల్ల, చాలా గుంపులతో సఖ్యత ఉండడం వల్ల వీళ్ళు ఇతరులకు అందుబాటులో ఉంటారు. ఈ వ్యక్తిత్వము వల్ల వీరు రాజకీయాల్లో రాణించగలరు.

Extrovert Celebrities – ఎక్సట్రావర్ట్స్ లక్షణాలు కలిగిన సెలబ్రిటీలు

  • సుమా కనకాల
  • మిమిక్రీ శివారెడ్డి
  • రాంగోపాల్ వర్మ
  • ఆటో రాంప్రసాద్