You are currently viewing GK Bits In Telugu Language – 3 :: జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

GK Bits In Telugu Language – 3 :: జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు

GK Bits In Telugu Language: జంతువులు, పక్షులు, చేపలు మొదలగు జీవరాశులకు సంబంధించిన వివిధ జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు జవాబులు వివరణ తో సహా ఇవ్వడం జరిగింది.

GK Bits In Telugu Language – జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు మరియు సమాధానాలు

(1) గుడ్లను పెట్టడంతో పాటు పాలను కూడా ఇచ్చే ఏకైక జీవి ఏది?
(A) డక్ బిల్లుడ్ ప్లాటిపస్ (Duck Billed Platypus)
వివరణ: డక్ బిల్లుడ్ ప్లాటిపస్ గుడ్లను పెట్టి వాటిని పొదుగుతుంది. తన పిల్లలకు పాలను పడుతుంది. అయితే పాలు ఇచ్చేందుకు డక్ బిల్లుడ్ ప్లాటిపస్ కు పొదుగు కానీ, చనుమొనలు కాని ఉండవు. తనకున్న ప్రత్యేకమైన గ్లాండ్స్ ద్వారా పాలను కడుపు పైన చర్మం నుండి బయటికి పంపిస్తుంది. మనిషికి శరీరం పైన చెమట ఎలా కారుతుందో, డక్ బిల్లుడ్ ప్లాటిపస్ కు తన కడుపు దగ్గర పాలు చుక్కలు చుక్కలుగా బయటకు కారతాయి. ఇది ఆస్ట్రేలియా దేశంలో కనబడుతుంది.

(2) ఏ సముద్రపు జీవి రక్తం నీలం రంగులో ఉంటుంది?
(A) ఆక్టోపస్ (Octopus)
వివరణ: ఆక్టోపస్ రక్తంలో హార్మోసియానిన్ ఉండడం వలన దాని రక్తం నీలం రంగులో ఉంటుంది.

(3) ప్రపంచంలో అత్యంత చిన్న పక్షి ఏది?
(A) హమ్మింగ్ బర్డ్ (Humming Bird)
వివరణ: హమ్మింగ్ బర్డ్ యొక్క పొడవు 5 సెంటీమీటర్లు గా నమోదైంది. అలాగే ఈ హమ్మింగ్ బర్డ్ యొక్క బరువు కేవలం 2 గ్రాములు మాత్రమే నమోదైంది.

(4) ప్రపంచంలో అత్యంత పెద్ద పక్షి ఏది?
(A) ఉష్టపక్షి (ఆస్ట్రిచ్ – Ostrich)
వివరణ: మగ ఆస్ట్రిచ్ పొడవు 2.1 మీటర్ల నుండి 2.8 మీటర్ల మధ్య ఉంటుంది. అలాగే దీని బరువు దాదాపు 120 కిలోలు ఉంటుంది.
ఆడ ఆస్ట్రిచ్ పొడవు 1.7 మీటర్ల నుండి 2.0 మీటర్ల మధ్య ఉంటుంది. అలాగే ఆడ ఆస్ట్రిచ్ బరువు దాదాపు 100 కిలోలు ఉంటుంది.
ఆస్ట్రిచ్ పెట్టే గుడ్డు బరువు దాదాపు 1.4 కిలోలు ఉంటుంది.



(5) నోటితో శబ్దం చేయలేని జంతువు ఏది?
(A) జిరాఫీ (Giraffe)
వివరణ: జిరాఫీ జంతువుల లోనే అత్యంత పొడవైన జంతువు. జిరాఫీ యొక్క మెడ 1.5 నుంచి 3.5 మీటర్ల మధ్య ఉంటుంది. పొడవైన మెడ కారణంగా దీనికి స్వర పేటిక ఉండదు. అందుకే ఇవి గొంతుతో ఏ రకమైన శబ్దం చేయలేవు.

(6) ఏ జంతువు నీరు త్రాగితే చనిపోతుంది?
(A) కంగారు ర్యాట్ (Kangaroo Rat)
కంగారు ర్యాట్ అమెరికా దేశంలో దక్షిణ ప్రాంతంలో కనబడుతుంది.

(7) ఏ జీవికి మూడు కళ్ళు ఉంటాయి?
(A) తొటారా (Tuatara)
తొటారా అనే జీవికి మూడు కళ్ళు ఉంటాయి. ఇది ఊసురువెళ్ళి లాగా ఉంటుంది. తొటారా న్యూజిలాండ్ దేశంలో కనబడుతుంది.



(8) ఏ కీటకం తన తల తెగిపోయినా దాదాపు వారం రోజుల పాటు జీవించగలదు?
(A) బొద్దింక (Cockroach)



(9) ప్రపంచంలో అత్యంత విష పూరితమైన చేప ఏది?
(A) స్టోన్ ఫిష్ (Stonefish)

(10) దెబ్బ తగిలితే మనిషిలాగా ఏడ్చే జంతువు ఏది?
(A) ఎలుగు బంటి (Bear)

Leave a Reply