GK Questions In Telugu Language – 1
(1) రెడ్ క్రాస్ సంస్థను ఎక్కడ స్థాపించారు?
(A) రెడ్ క్రాస్ సంస్థను స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో స్థాపించారు.
(2) మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలైంది?
(A) మొదటి ప్రపంచ యుద్ధం 1914 లో మొదలైంది.
(3) ల్యాండ్ ఆఫ్ ది కేక్స్ అని ఏ యూరోపియన్ దేశాన్ని పిలుస్తారు?
(A) స్కాట్లాండ్
(4) థాయిలాండ్ దేశపు కరెన్సీ ని ఏమని పిలుస్తారు?
(A) భాట్ (థాయ్ భాట్)
(5) గౌతమ బుద్ధుని కి జ్ఞానోదయం అయిన ప్రదేశం ఏది?
(A) బోధ్ గయా
(6) భారతదేశంలో రెండవ అతిపెద్ద నది ఏది?
(A) గోదావరి నది
(7) నందాదేవి బయోస్పియర్ ఏ రాష్ట్రంలో ఉంది?
(A) ఉత్తరాఖండ్
(8) గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూని (విగ్రహాన్ని) ఏమని పిలుస్తారు?
(A) స్టాచ్యూ ఆఫ్ యూనిటీ
(9) నార్త్ పోల్ మీదుగా మొట్టమొదటిసారి ప్రయాణించింది ఎవరు?
(A) షీలా స్కాట్
(10) భారతదేశంలో అసెంబ్లీ స్పీకర్ పదవిని నిర్వహించిన మొట్టమొదటి మహిళ ఎవరు?
(A) షాన్నో దేవి – పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ గా 1951వ సంవత్సరంలో షాన్నో దేవి నియమితులయ్యారు.
(11) భారతదేశంలో లోక్ సభ స్పీకర్ పదవిని నిర్వహించిన మొట్టమొదటి మహిళ ఎవరు?
(A) మీరా కుమార్
(12) భారతదేశంలో మొట్ట మొదటి మహిళా ఐఏఎస్ అధికారి ఎవరు?
(A) అన్నా రాజం జార్జ్ – కేరళకు చెందిన అన్నా రాజం జార్జ్ ను అన్నా రాజం మల్హోత్రా అని కూడా పిలుస్తారు.
(13) అతి పిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతిని పొందింది ఎవరు?
(A) మలాలా యూసఫ్ జాయ్ – 17 సంవత్సరాల వయసులో మలాలా యూసఫ్ జాయ్ కి నోబెల్ శాంతి బహుమతి లభించింది.
(14) భారతదేశంలో “ఆర్మీ డే” ని ఎప్పుడు జరుపుకుంటారు?
(A) జనవరి 15
(15) భారతదేశం తయారు చేసిన మొట్టమొదటి మిసైల్ పేరేమిటి?
(A) పృథ్వి మిస్సైల్
(16) ప్రపంచంలో మొట్టమొదటి టేకు (చెక్క) మ్యూజియాన్ని ఎక్కడ స్థాపించారు?
(A) నీలంబుర్
(17) ఆధార్ కార్డుని పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు?
(A) రంజనా సోనావణె
(18) వన్డే లో డబుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయ క్రికెటర్ ఎవరు?
(A) సచిన్ టెండూల్కర్
(19) మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది?
(A) 2014
(20) “రాజీవ్ గాంధీ ఖేల్ రత్న” అవార్డును పొందిన మొట్టమొదటి క్రీడాకారుడు ఎవరు?
(A) విశ్వనాథన్ ఆనంద్
(21) ఏ సంవత్సరంలో డాక్టర్ సి వి రామన్ గారికి నోబుల్ ప్రైజ్ వచ్చింది?
(A) 1930
(22) బిఎస్ఎఫ్ ఫుల్ ఫార్మ్ ఏమిటి?
(A) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
(23) భారతదేశంలో సతీ (సతీ సహగమనం) ఆచారాన్ని ఏ సంవత్సరంలో నిషేదించారు?
(A) 1829
(24) చతుర్వేదాలల్లో మొదటి వేదం ఏది?
(A) ఋగ్వేదం
(25) అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పేరు ఏంటి?
(A) పోర్ట్ బ్లెయిర్