General Knowledge Questions In Telugu Part 2 – జనరల్ నాలెడ్జ్

General Knowledge Questions In Telugu Language: తెలుగు జనరల్ నాలెడ్జి ప్రశ్నలు మరియు వాటి జవాబులు.

ఇక్కడ మొత్తం 25 జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు మరియు వాటి జవాబులు తెలుగులో ఇవ్వడం జరిగింది. భారతదేశ మరియు అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తెలుగు ప్రశ్నలు వాటి జవాబులు మాత్రమే వివరించడం జరిగింది.

General Knowledge Questions In Telugu – India GK Questions

(1) ఏ దీవి పేరును అబ్దుల్ కలాం ఐలాండ్ గా తిరిగి నామకరణం చేశారు?
(A) వీలర్ ఐలాండ్ – ఒడిసా లోని భువనేశ్వర్ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఈ దీవి ఉంది. ఈ దీవిలో మిసైల్ టెస్టింగ్ కేంద్రం నుంచి క్షిపణి పరిక్షలను నిర్వహిస్తుంటారు.

(2) భారతదేశంలో వెలువడిన తొలి వార్తా పత్రిక పేరేంటి?
(A) హిక్కీస్ బెంగాల్ గేజెట్ అనే ఆంగ్ల పత్రికను 1780వ సంవత్సరంలో జేమ్స్ ఆగస్టస్ హిక్కీ అనే ఐరిష్ దేశస్తుడు కలకత్తాలో ప్రారంభించారు.

(3) ఢిల్లీలో రాష్ట్రపతి భవనాన్ని ఎవరు డిజైన్ చేశారు?
(A) ఎడ్విన్ లుటియెన్స్ రాష్ట్రపతి భవనంతో పాటు ఇండియా గేట్, హైదరాబాద్ హౌస్ లాంటి అనేక అద్భుతమైన కట్టడాలను డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్.

(4) మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు?
(A) బచేంద్రి పాల్ 1984వ సంవత్సరంలో మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించి తన ధైర్యసాహసాలు ప్రదర్శించింది. భారత ప్రభుత్వం బచేంద్రి పాల్ ను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.

(5) కజిరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?
(A) అస్సోం లోని కజిరంగా నేషనల్ పార్క్ లో డైనోసార్ల కాలం నాటి ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు దాదాపు 2200 వరకు ఉన్నాయి. అందుకే యునెస్కో 1985 వ సంవత్సరంలో దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది.

(6) భారతదేశపు మొట్టమొదటి ఫార్ములా వన్ డ్రైవర్ ఎవరు?
(A) నరేన్ కార్తికేయన్

(7) ఖజురహో శిల్పాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
(A) మధ్యప్రదేశ్

(8) భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించింది ఎవరు?
(A) సుచేత క్రిప్లాని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1963 నుంచి 1967 వరకు బాధ్యతలు నిర్వహించారు.

(9) కేరళ రాష్ట్ర రాజధాని పేరేమిటి?
(A) తిరువనంతపురం

(10) ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసిన మొట్టమొదటి భారతీయ బౌలర్ ఎవరు?
(A) అనిల్ కుంబ్లే

(11) భారతదేశంలో మొట్టమొదటి ఆస్కార్ అవార్డును గెలుచుకున్నది ఎవరు?
(A) భాను అథాయియా

(12) భారతదేశంలో మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ ను గెలుచుకున్నది ఎవరు?
(A) మహేష్ భూపతి (మహేష్ శ్రీనివాస్ భూపతి అనేది ఇతని పూర్తి పేరు)

(13) భారతదేశపు మొట్టమొదటి ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు?
(A) కేఎం కరియప్ప

(14) భారతదేశంలో నిర్మించబడిన మొట్టమొదటి మరియు అతి ప్రాచీనమైన ఆనకట్ట (డ్యాం) పేరు ఏమిటి?
(A) కల్లనయ్ ఆనకట్టని (డ్యాం) కావేరి నది పైన కరికాల చోళ రాజు ఒకటవ శతాబ్దంలో నిర్మించారు.

(15) భారతదేశంలో నిర్మించబడిన మొట్టమొదటి చలన చిత్రం ఏది?
(A) రాజా హరిశ్చంద్ర

International GK Questions In Telugu

(16) రెడ్ క్రాస్ సంస్థను ఎవరు స్థాపించారు?
(A) హెన్రీ డునంట్

(17) చిలీ దేశపు కరెన్సీని ఏమని పిలుస్తారు?
(A) పెసో

(18) ఫ్రాన్స్ దేశంలో అతి పెద్ద నది ఏది?
(A) లోరా (Loire)

(19) ఆస్ట్రేలియా మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు?
(A) ఎడ్మండ్ బాస్టన్

(20) అడాల్ఫ్ హిట్లర్ భార్య పేరు ఏమిటి?
(A) ఈవా బ్రౌన్

(21) జపాన్ దేశపు పార్లమెంట్ ని ఏమని పిలుస్తారు?
(A) డైట్ (Diet)

(22) “ది లాఫింగ్ కావలీర్” పెయింటింగ్ ను వేసిన చిత్రకారుడు ఎవరు?
(A) ఫ్రాన్స్ హాల్స్

(23) అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ ని చంపిందెవరు?
(A) లీ హార్వే ఆస్వాల్డ్

(24) “ద స్ట్రగుల్ ఇన్ మై లైఫ్” అనే పుస్తకాన్ని రచించింది ఎవరు?
(A) నెల్సన్ మండేలా

(25) “బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ యూరోప్” అని ఏ దేశాన్ని పిలుస్తారు?
(A) బెల్జియం

Leave a Reply