Hindi To Telugu Translation – హిందీ పదాల అర్థాలు తెలుగు లో [PART 1]

Hindi To Telugu Translation – హిందీ పదాల అర్థాలు తెలుగు లో [PART 1]


ప్రస్తుతం గూగుల్ లో వెతుకుతున్న కొన్ని హిందీ పదాల అర్థాలను తెలుగు లో తెలుసుకుందాం. ఇవి ఎక్కువగా సూపర్ హిట్ అయిన కొన్ని సినిమాల్లోని పదాలు. హిందీ పదాల అర్థాలు తెలుగులో Hindi To Telugu Translation అనే ట్యాగ్ క్రింద పబ్లిష్ చెయ్యడం జరుగుతుంది.




Hindi To Telugu Translation Of Bawaal, Bavaal – బవాల్ అర్థం తెలుగులో

బవాల్ (बवाल) అనేది పూర్తిగా హిందీ పదము. దీన్ని ఇంగ్లీష్ లో Bavaal, Bawaal అని వ్రాస్తారు. బవాల్ అంటే తెలుగులో గలాటా, కొట్లాట అని అర్థాలు వస్తాయి. బవాల్ అనే పదాన్ని ముఖ్యంగా రెండు గుంపులు లేదా రెండు వర్గాల మధ్య జరిగే పెద్ద కొట్లాటలను ఉద్దేశించి వాడుతారు. ఈ కొట్లాటల్లో అరుపులు, పిడిగుద్దులు, వస్తువులను ధ్వంసం చేయడం, రాళ్ళు విసురుకోవడం వంటివి ఉంటాయి.

Bawal Meaning In Telugu – బవల్ మీనింగ్ ఇన్ తెలుగు

మరో రకంగా చూస్తే Bawal (బవల్) అనేది హర్యానా రాష్ట్రం లోని ఒక ఊరు. ఈ బవల్ అనే ఊరు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) పరిధిలో కలదు.

Hindi To Telugu Translation Of Bahara, Gunga, Andha – బహరా, గూంగా, అంధా పదాల అర్థాలు తెలుగులో



బహరా (बहरा) అనే హిందీ పదాన్ని ఇంగ్లీష్ లో Bahara అని వ్రాస్తారు. బహరా అంటే తెలుగులో చెవుడు, చెవిటి అని అర్థం వస్తుంది.

గూంగా (गूंगा) అంటే తెలుగులో మూగ అని అర్థం.

అంధా అంటే తెలుగులో గుడ్డి అని అర్థం వస్తుంది. అంధాధున్ అంటే గుడ్డిగా, మొండి గా అని అర్థాలు వస్తాయి. అంధాధున్ పేరుతో ఇటీవలి కాలంలో ఒక సూపర్ హిట్ హిందీ సినిమా వచ్చింది.

Yarana (याराना) Meaning In Telugu – యారానా అర్థం తెలుగులో

యారానా (याराना) అంటే స్నేహము, దోస్తీ అని తెలుగు లో అర్థాలు వస్తాయి. అయితే యారానా పదం వాడినప్పుడు ఆ స్నేహం ఇంకా కొనసాగుతూనే ఉంది అని అర్థం. విడిపోయిన స్నేహితుల మధ్య, స్నేహం గురించి మాట్లాడేటప్పుడు యారానా అనే పదాన్ని వాడరాదు.

Rabba Ve (रब्बा वे) Meaning In Telugu – రబ్బా వే అర్థం తెలుగులో




రబ్బా వే (रब्बा वे) అనేది పంజాబీ పదం.ఈ పదాన్ని పంజాబీ తో పాటు హిందీలో కూడా ఎక్కువగా వాడుతారు. రబ్బా అంటే దేవుడు అని అర్థం. రబ్బా వే అంటే తెలుగులో ఓ దేవుడా, ఓరి దేవుడా, ఓ స్వామి అని అర్థాలు వస్తాయి. మనము తెలుగులో ఈ పదాలను భక్తితో, వ్యంగ్యంగా, ఊతపదం లాగా ఎలా వాడతామో అలాగే పంజాబీ మరియు హిందీ భాషలలో కూడా వాడుతారు.