You are currently viewing Independence Day Telugu Speech || స్వాతంత్ర్య దినోత్సవం స్పీచ్ ఇన్ తెలుగు

Independence Day Telugu Speech || స్వాతంత్ర్య దినోత్సవం స్పీచ్ ఇన్ తెలుగు

ఆగస్టు 15 వ తేదీన మనమందరము భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాము. ప్రతి స్కూల్లో, ప్రభుత్వ ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో మరియు ఇతరత్ర సంస్థల్లో మన జాతీయ జెండాను ఎగుర వేస్తారు. స్వాతంత్ర్య దినోత్సవం గురించి తప్పనిసరిగా స్పీచ్ ఉంటుంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎక్కువగా స్పీచ్ ను స్టూడెంట్స్, పొలిటీషియన్స్, ఆఫీసర్స్, ఎంప్లాయీస్ తప్పనిసరిగా ఇస్తుంటారు. అటువంటి వారికోసం Independence Day Telugu Speech ను ఈ పోస్టులో పొందుపరిచాము. దీనిని పీడీఎఫ్ ఫైల్ రూపంలో కూడా అందిస్తున్నాము.

75th Independence Day Telugu Speech For Students [15 August, 2021] || 75 వ స్వాతంత్ర్య దినోత్సవం స్పీచ్ ఇన్ తెలుగు

గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి, మన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థినీ విద్యార్థులకందరికీ నా నమస్కారములు. ముందుగా ఇక్కడ ఉన్న అందరికీ 75 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ పర్వదినాన ఉపన్యాసం ఇచ్చేందుకు అనుమతించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోదలుచుకున్నాను. నేడు మనము 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ఆగస్టు 15వ తేదీ ప్రతి భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచంలో ఎక్కడున్నా, భారతీయులందరూ ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా పండుగలాగా జరుపుకుంటారు.

ప్రతి దేశానికి పరుల పాలన లేదా ఆక్రమణ నుండి విముక్తి లభించిన రోజును స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితి. దాదాపు రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని చవిచూసాము. 1947వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన ఈ బానిసత్వం నుండి విముక్తిని పొందాము. అప్పటి నుండి ఆగస్టు 15వ తేదీన మనము స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ వేడుకలు జరుపుకునేందుకు వీలుగా, ఆగస్టు 15 తేదీని జాతీయ సెలవు దినంగా పాటిస్తున్నాము.

మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోట పై జాతీయ జెండాను భారత ప్రధానమంత్రి ఎగురవేయడం ఆనవాయితి. ఈ రోజు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా, మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు. ఎర్రకోట వద్ద మన సైనికులు చేసే సాహసాలు, విన్యాసాలు అబ్బురపరు‌స్తాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు ఆయా రాష్ట్రాల పురోగతిని ప్రతిబింబిస్తుంది. మన [ఆంధ్రప్రదేశ్ / తెలంగాణ] రాష్ట్రం తరుపున వ్యవసాయం, కళలకు సంబంధించిన శకటాలను ఎక్కువగా ప్రదర్శిస్తారు.

అలాగే మన రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి (శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు / శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు) త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఇక్కడ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా శకటాలను ప్రదర్శిస్తారు. రాష్ట్రానికి సేవలందించిన వారిని మన ముఖ్యమంత్రి గారు సత్కరిస్తారు.

స్వాతంత్ర దినోత్సవం అంటే కేవలం వేడుకలు జరుపుకునే రోజు మాత్రమే కాదు. ఇది దేశభక్తి మరియు స్వేచ్ఛ యొక్క మధురానుభూతి. వ్యాపార నిమిత్తం భారతావనిలోకి అడుగు పెట్టారు బ్రిటిష్ దేశస్తులు. కానీ వారు క్రమంగా మన దేశాన్ని వారి అధీనంలోకి తెచ్చుకోవడం మొదలుపెట్టారు. కొందరు రాజులను ప్రలోభ పెట్టి, వారి రాజ్యాలను తమ ప్రభావం కిందికి తెచ్చుకున్నారు బ్రిటిషర్లు. చాలా ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించుకుంటూ వెళ్లారు. ఇలా 18 వ శతాబ్దం చివరి నాటికి, భారతదేశంలో చాలా భాగాన్ని తమ పరిపాలన కిందకు తెచ్చుకున్నారు.

బ్రిటిష్ పాలనను వ్యతిరేకించిన భారతీయులు 1857 సంవత్సరంలో సిపాయి తిరుగుబాటు చేశారు. దీనినే ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంగా పేర్కొంటూ ఉంటారు. ఈ సంగ్రామంలో మన సిపాయిలు, రాజులు ఓడిపొయ్యారు. దీంతో 1858 వ సంవత్సరంలో బ్రిటీష్ రాణి క్వీన్ విక్టోరియా భారత సామ్రాజ్య అధినేత్రిగా అవతరించింది. అప్పటి నుండి భారతదేశం పూర్తిగా బ్రిటీష్ పాలనలోకి వెళ్ళింది.

బ్రిటిష్ పరిపాలన నుంచి భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించుకునే క్రమంలో అనేక పోరాటాలు చేసారు మన పూర్వీకులు. ఎందరో దేశభక్తులు కులమతాలకు అతీతంగా పాల్గొన్నారు. అలాగే ఈ పోరాటంలో ఎందరో వీరనారీమణులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. చాలా మంది నాయకులు సాధారణ జనాల్లో దేశభక్తిని నింపి, వారిని ఉద్యమాల్లో పాల్గొనేలా చేశారు. ఈ సంగ్రామంలో దేశం నలుమూల నుండి అనేకమంది గొప్ప నాయకులు పాల్గొన్నారు. వీరు ఎంచుకున్న విధానాలు వేరు అయినప్పటికీ, వీరి గమ్యం మాత్రం భారతదేశానికి స్వాతంత్ర్యం తేవడమే. ఈ పోరాటాల్లో కొన్ని లక్షలమంది, దేశం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించారు.

ముఖ్యంగా మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, లాల్ బహదూర్ శాస్త్రి, బాలగంగాధర్ తిలక్ లాంటి ప్రముఖులు చేసిన పోరాటం ఎప్పటికీ మరువలేనిది. అహింసా మార్గాన్ని ఎంచుకున్న గాంధీజీతో అనేక మంది నాయకులు, ప్రజలు నడిచారు. అన్ని చోట్ల బ్రిటీషర్లకు భారతీయుల నిరసన కళ్ళకు కట్టినట్టు కనపడింది. ఎట్టకేలకు బ్రిటిష్ ప్రభుత్వం 1947 వ సంవత్సరంలో ఆగస్టు 14 తేదీ రాత్రి సమయాన (అనగా ఆగస్టు 15 తెల్లవారుజామున) భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మనము ఆగస్ట్ 15 వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్నాము.

మనము ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలం. అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనము స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాలి. అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మన వంతు కృషి చేయాలి. వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కలలు కన్నారో, ఆ కలలను మనమందరం సాకారం చెయ్యాలి. ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిప్రతిష్టలు పెంపొందేలా చెయ్యడం మన బాధ్యత అని మీకు గుర్తుకు చేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.

Independence Day Telugu Speech PDF File Free Download – స్వాతంత్ర్య దినోత్సవం స్పీచ్ [ఉపన్యాసం] పీడీఎఫ్ ఫైల్ డౌన్లోడ్

ఇండిపెండెన్స్ డే ఇన్ తెలుగు స్పీచ్: ఇక్కడ క్రింద ఉన్న బటన్ పైన క్లిక్ చేసి స్వాతంత్ర్య దినోత్సవం ఉపన్యాసం పీడీఎఫ్ ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోండి.

August 15th, 2021 Speech In Telugu For Politicians, Employees And Others || ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం స్పీచ్

పైన విద్యార్థులకు పొందుపరిచిన స్పీచ్ లో మొదటి పేరాగ్రాఫ్ ను క్రింద చెప్పిన విధంగా మార్చుకొని ఉపయోగించగలరు.

Swatantra Dinotsavam Speech First Para Modification

వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడున్న ఉద్యోగస్తులకు, కార్మికులకు అందరికీ నా నమస్కారములు. ముందుగా ఇక్కడ ఉన్న అందరికీ 75 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ పర్వదినాన ఉపన్యాసం ఇచ్చేందుకు అనుమతించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. [అలాగే నాకు మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశేందుకు అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను.]

Leave a Reply