Introvert Meaning In Telugu – ఇంట్రావర్ట్ మీనింగ్ ఇన్ తెలుగు

Introvert Meaning In Telugu – ఇంట్రావర్ట్ మీనింగ్ ఇన్ తెలుగు




ఒక వ్యక్తి ఆలోచనా సరళిని బట్టి మరియు ఇతరులతో ప్రవర్తించే తీరును బట్టి మనుషులను మూడు రకాలుగా విభజించారు. అవి ఇంట్రావర్ట్, ఎక్సట్రావర్ట్ మరియు యాంబివర్ట్. ఎటువంటి వ్యక్తులను ఇంట్రావర్ట్ అని అంటారో ఈ Introvert Meaning In Telugu పోస్టులో వివరించడం జరిగింది. ఈ పోస్టులో ఇంట్రావర్ట్స్ కి ఉండే లక్షణాలను కూడా తెలియజేయడం జరిగింది. మన తెలుగువారితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇంట్రావర్ట్స్ గా ముద్రపడిన ప్రముఖుల పేర్లను కూడా ఇవ్వడం జరిగింది.

Introvert Meaning In Telugu – ఇంట్రావర్ట్ మీనింగ్ ఇన్ తెలుగు

ఇంట్రావర్ట్ అంటే తెలుగులో అంతర్ముఖుడు అని అర్థం. అంతర్ముఖుడు అంటే లోలోపల ఆలోచించు వ్యక్తి అని అర్థం. అటువంటి వ్యక్తి తన ఆలోచనలను ఇతరులతో అంత త్వరగా పంచుకోడు. అలాగే ఈ ఇంట్రావర్ట్స్ ఇతరులతో అంత సులభంగా కలవరు. “గుంపులో గోవింద” లాగా ఉండడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. వీరికి పూర్తిగా నచ్చిన వారితోనే సంభాషిస్తారు. అందుకే వీళ్ళకు స్నేహితులు కొద్దిమంది మాత్రమే ఉంటారు.



Introverts Characteristics – ఇంట్రావర్ట్స్ లక్షణాలు

  1. ఇంట్రావర్ట్స్ ఎక్కువగా సొంత ఆలోచనలు కలిగి ఉంటారు. ఎక్సట్రావర్ట్స్ మరియు యాంబివర్ట్స్ తో పోలిస్తే ఇంట్రావర్ట్స్ కి క్రియేటివిటి (సృజనాత్మకత), ఊహాశక్తి అధికంగా ఉంటాయి.
  2. వీళ్ళు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. ఏకాంతంగా, ప్రశాంతంగా ఉండడం వల్లే వీరు అద్భుతమైన ఆలోచనలతో మంచి ఫలితాలను పొందుతారు.