You are currently viewing ఎమర్జెన్సీ మూవీ ఫస్ట్ లుక్, ట్రైలర్: ఇందిరా గాంధీ పాత్రలో ఒదిగిపోయిన కంగనా రనౌత్
Kangana Ranaut in Emergency Movie

ఎమర్జెన్సీ మూవీ ఫస్ట్ లుక్, ట్రైలర్: ఇందిరా గాంధీ పాత్రలో ఒదిగిపోయిన కంగనా రనౌత్

దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న చిత్రమే “ఎమర్జెన్సీ“. ఈ సినిమా లో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటిస్తోంది. ఈ చిత్రానికి కంగనానే దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా ఆమె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న వారిలో ఒకరు.

ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ట్రైలర్ ను గురువారం నాడు విడుదల చేశారు. ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ ఒదిగిపోయింది. ఇందిరా గాంధీకి కంగనా రనౌత్ కు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అనుపమ్ ఖేర్ కంగనా రనౌత్ ను పొగడ్తలతో ముంచెత్తాడు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న “ఎమర్జెన్సీ” చిత్రం త్వరలో థియేటర్లలోకి రానుంది. కంగనా స్వీయ దర్శకత్వం వహించిన మణికర్ణిక బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. “ఎమర్జెన్సీ” చిత్రం ఫస్ట్ లుక్, ట్రైలర్ చూసిన తరువాత ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందని అభిమానులు ధీమాగా చెబుతున్నారు.

Leave a Reply