You are currently viewing లలిత్ మోడీ సుస్మితా సేన్ ల ఘాటు ప్రేమాయణం || Lalit Modi Dating Susmitha Sen
లేటు వయసులో ఘాటు ప్రేమ: లలిత్ మోడీ సుస్మితా సేన్ ల ప్రేమాయణం

లలిత్ మోడీ సుస్మితా సేన్ ల ఘాటు ప్రేమాయణం || Lalit Modi Dating Susmitha Sen

  • Post author:
  • Post category:Movies

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మాజీ చైర్మన్ లలిత్ మోడీ మాజీ మిస్ యూనివర్స్ మరియు బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్ తో డేటింగ్ చేస్తున్నట్లు గురువారం వెల్లడించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ లో సుస్మితా సేన్ తో తన సంబంధాన్ని అధికారికంగా తెలియజేశాడు లలిత్ మోడీ.

ట్విట్టర్లో లలిత్ మోడీ సుస్మిత సేన్ తో కలిసున్న ఫోటోలను షేర్ చేశాడు. కొన్ని ఫోటోలు అయితే 15 సంవత్సరాల క్రితంవి కూడా ఉన్నాయి. వీరిద్దరికీ చాలా సంవత్సరాల నుంచే స్నేహం ఉందన్న విషయం ఆ ఫోటోలను చూస్తే అర్ధం అవుతుంది.

ఐపిఎల్ రూపకల్పన లో లలిత్ మోడీ ముఖ్యుడు. 2008 వ సంవత్సరం లో ఐపీఎల్ తొలి చైర్మన్ గా వ్యవహరించాడు లలిత్ మోడీ. క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ తెగ నచ్చేయడంతో లలిత్ మోడీ భారత క్రికెట్ కొత్త శిఖరాలకు తీసుకు వెళుతున్నాడని కొనియాడారు.

అయితే 2010 లో సంవత్సరం లో జరిగిన ఐపీఎల్ మ్యాచుల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడని బీసీసీఐ దృష్టికి వచ్చింది. అంతేకాకుండా పూణే, కొచ్చి ఫ్రాంచైజీ లతో బిడ్లలో రిగ్గింగ్ కు పాల్పడ్డాడని, క్రమశిక్షణా రాహిత్యం తో ప్రవర్తించాడని బీసీసీఐ అతడి పైన ఒక కమిటీని వేసింది.

2013 లో సంవత్సరం లో కమిటీ తన నివేదికను బీసీసీఐ కి సమర్పించింది. ఆరోపణలు రుజువు కావడంతో పాటు అతడి వల్ల ఐపీఎల్ ఉనికికే ప్రమాదం పొంచి ఉందని కమిటీ నిర్ధారించింది. దీంతో బీసీసీఐ లలిత్ మోడీ పై జీవితకాల నిషేధం విధించింది. క్రికెటర్ లకు కూడా లలిత్ మోడీని దూరం పెట్టాలని హెచ్చరించింది.

బీసీసీఐ జీవితకాల నిషేధం విధించడంతో లలిత్ మోడీ తన మకాంను లండన్ కు మార్చేశాడు. అప్పటి నుండి అక్కడే నివసిస్తున్నాడు లలిత్ మోడీ. అక్కడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరు కలిసి టూర్లకు, పార్టీలకు వెళ్ళిన ఫోటోలను కూడా షేర్ చేశాడు లలిత్ మోడీ.