You are currently viewing Love Failure Quotes In Telugu || లవ్ ఫెయిల్యూర్ కోట్స్ ఇన్ తెలుగు

Love Failure Quotes In Telugu || లవ్ ఫెయిల్యూర్ కోట్స్ ఇన్ తెలుగు

Love Failure Quotes In Telugu Language : ఈ ఆర్టికల్ లో పూర్తిగా లవ్ ఫెయిల్యూర్ కి సంబంధించిన తెలుగు కోట్స్ పొందుపరిచాము. ఈ కోట్స్ తో పాటు లవ్ ఫెయిల్యూర్ కి సంబంధించిన తెలుగు కొటేషన్స్, తెలుగు కవితలు కూడా కలవు.

30 Love Failure Quotes In Telugu – 30 లవ్ ఫెయిల్యూర్ కోట్స్, కొటేషన్స్ తెలుగులో

ఇంకిపోయిన కన్నీరు
మరిచిపోయిన చిరునవ్వు
మనసులో తెలియని తీపి బాధ
ఏదో ఇంకా బ్రతికే ఉన్నాను
నువ్వు ఏదో ఒక రోజు తిరిగి నన్ను ప్రేమిస్తావనే ఆశతో

నీ మనస్సును కరిగించే లోపు
నా వయస్సు కరిగిపోవచ్చేమోగానీ
నీ పైన నా ప్రేమ మాత్రం తరిగిపోదు

ప్రాణం పోతే ఎలా ఉంటుందో తెలియదు కానీ
మనకిష్టమైన వాళ్ళు మనల్ని దూరం పెడితే నరకం కనబడుతుంది

కళ్ళకు ఎందరో నచ్చుతారు
మనస్సుకు మాత్రం కొందరే నచ్చుతారు
ఆ కళ్లకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిచేలోపు మర్చిపోవచ్చు
కానీ మనసుకు నచ్చిన వారిని మరణించేంత వరకు మరువలేము

Love Failure Quotes In Telugu Text
లవ్ ఫెయిల్యూర్ కోట్స్ & కొటేషన్స్ తెలుగు లో

నా పైన నీకు ద్వేషం ఉందని తెలుసు
అయినా నీ పైన ప్రేమను మాత్రమే చూపించమని చెబుతుంది నా మనసు

నా శరీరం లో నాకు ఇష్టమైనవి రెండే రెండు
నీ రూపాన్ని నాకు పరిచయం చేసిన నా కళ్ళు
నీతో ఊహల పల్లకిలో విహరించిన నా మనసు
నిన్ను పరిచయం చేసినందుకు నా కళ్ళల్లో కన్నీరు ఇంకి పోయింది
నీ తీపి జ్ఞాపకాలతో నా మనసు గాయపడింది
నా కళ్ళు, నా మనసు రెండు శిక్షను అనుభవిస్తూనే ఉన్నాయి

ప్రేమ వలన పొందే ఆనందం శాశ్వతమో కాదో తెలియదు కానీ
ప్రేమ వల్ల పొందే దుఃఖం మాత్రం శాశ్వతం

నా ప్రేమ నిన్ను ఎంతలా ప్రేమించాలో నేర్పింది
నీతో జీవితం ఎలా పంచుకోవాలో నేర్పింది
నువ్వే నా సర్వం అని తెలియజేసింది
ఇన్ని నేర్పిన నా ప్రేమ నిన్ను మర్చిపోవడం మాత్రం నేర్పట్లేదు

Love Failure Telugu Quotes
Love Failure Telugu Quotes [Image Credits: Jeswin Thomas, pexels]

ప్రేమించి మోసం చేయడం నీ తప్పు కాదు
కానీ మోసపోయేంతలా నిన్ను ప్రేమించడం నా తప్పు

ఏ వ్యక్తితో అయితే జీవితాంతం కలిసి నడవాలని కలలు కంటామో..
ఆ వ్యక్తే మనల్ని మధ్యలో ఒంటరిని చేసి వదిలేస్తే, వచ్చే బాధ వర్ణనాతీతం.

చితి వరకు చేరుతుందనుకున్న చెలిమి
చెంతనే ఉంటూ దూరం అయిపోతుంటే
చింతే మిగిలి కన్నీరే కావ్యమవుతోంది

పాము కాటుకి ఒక్కసారే చస్తారు..
కానీ ప్రేమ కాటుకి జీవితాంతం చస్తూ బ్రతుకుతారు.

ఎదురు చూసే ప్రేమలో తీయదనం ఉంటుంది
ఎదురు చూపించుకునే ప్రేమలో నిర్లక్ష్యం ఉంటుంది.

ప్రేమించడం సులువే, కానీ ప్రేమించబడటం కష్టం..
ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం అసలైన కష్టం.

నువ్వు దూరమైనప్పుడు కలిగిన బాధ కన్నా..
నువ్వు గుర్తు వచ్చినప్పుడల్లా కలిగే బాధ ఇంకా ఎక్కువ

నేను నీకు అవసరం లేదని నాకు తెలుసు
కానీ నా పిచ్చి మనసుకు తెలియదు కదా
నువ్వు వస్తావనే భ్రమతో..
నీకై ఎదురుచూస్తూనే ఉంది.

నీతో గడిపిన క్షణాలను తల్చుకుంటూ..
నువ్వు లేని క్షణాలను గడుపుతున్నాను.

నువ్వు నా హృదయాన్ని గాయపరిచిన,
నిన్ను మాత్రం నా మనసులోనే కొలువుంచాను.
నా ఒంటరి ప్రయాణంలో నాకు జంటగా నువ్వు ఉన్నావని నా మనసుకు మాత్రమే తెలుసు.

నిన్ను చూడకుండా ఎన్ని గంటలైనా ఉండగలను..
కానీ నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను.

పగటి కలలు కనడం నాకిష్టం..
నా ప్రతి కలలో నువ్వే వస్తావు కాబట్టి
అద్దంతో మాట్లాడటం నాకిష్టం..
నేను మాట్లాడే ప్రతి మాట నీ గురించే కాబట్టి
ఊహల్లో బ్రతకడం నాకిష్టం..
నా ప్రతి ఊహలో నువ్వే ఉంటావు కాబట్టి
అందుకే అందరి దృష్టిలో నేను చేతకాని వాడిని ముద్ర వేసుకున్నాను.

నీ జ్ఞాపకాలు ముళ్ళై గుచ్చుకుంటున్నా,
నా మనసుకు మాత్రం ఆ గాయం ఓ తియ్యదనమే.

నేను నిన్ను మర్చిపోవడానికి నువ్వు నా గతం కాదు, నా జ్ఞాపకానివి..
గతాన్ని మరచిపోయినంత తొందరగా, జ్ఞాపకాలను మర్చిపోలేము.

సృష్టిలో ఒక మనిషిని హింసించేందుకు ఆయుధాలు ఎన్నో ఉండొచ్చు..
కానీ ప్రేమ అనే తీయటి ఆయుధం ఒకటుందని నాకు తెలియలేదు..
నువ్వు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయేంతవరకు.

ఎదురొచ్చే అలలనైనా ప్రియుడు ఎదురించి ఆపగలడేమోగానీ..
ప్రియురాలు కాదన్నప్పుడు, అతని కళ్ళల్లో తన్నుకొచ్చే కన్నీటిని మాత్రం ఆపకోలేడు.

ప్రేమలో ఓడిపోవడం అంటే
ప్రేమించిన మనిషికి దూరమవ్వడం..
ప్రేమను వదులుకోవడం కాదు.

కాలం మనిషిని మార్చినా.. మనసులో ఉన్న జ్ఞాపకాలను మాత్రం చెరుపలేదు.

Love Failure Telugu Quotes By @ArunaMajji

నిన్ను వెతకని రోజున,
వరమై వచ్చావు..
వెతికిన రోజున,
ద్వేషమై వెనుదిరిగావు.

చదవగలిగే శక్తి నీకుంటే..
కనుల సాగరాన..
తీరాన్ని తాకని కలల అలలు ఎన్నో..
భావాలుగా నిండి ఉన్నాయి.

మరిచిపోవడానికి కష్టంగా ..
గుర్తుంచుకోవడానికి బాధగా ..
ఆలోచనలో జారిపోయే కన్నీటి చుక్కగా ..
జ్ఞాపకాలలో చెరగని గుర్తుగా ..
ఎవరో ఒకరు ఉంటారు మన జీవితంలో.

తప్పు ఎవరిదో ఒప్పు ఎవరిదో తెలియదు కానీ,
బాధనైతే మోయాల్సి వస్తుంది ఒక్కోసారి.

Leave a Reply