You are currently viewing మోటివేషనల్ తెలుగు కోట్స్ – మన జీవిత గమ్యాన్ని మార్చివేయ గలవు

మోటివేషనల్ తెలుగు కోట్స్ – మన జీవిత గమ్యాన్ని మార్చివేయ గలవు

25 మోటివేషనల్ తెలుగు కోట్స్

మన జీవితంలో కొన్ని సార్లు అనుకోని కష్టాలు వచ్చి పడుతుంటాయి. ఆ కష్టాలను భరించి ముందుకు సాగేందుకు దోహదపడే కొన్ని మోటివేషనల్ తెలుగు కోట్స్ మీకోసం.

దాయం పడితేనే ఆట ప్రారంభం అవుతుంది, గాయం తగిలితేనే జీవితం ఆరంభం అవుతుంది.

న్నింటినీ నాశనం చేసే ఈ మట్టి, విత్తనానికి మాత్రం ప్రాణం పోసి జీవము ఇస్తుంది.
అదే సృష్టి ధర్మం.

నిషిగా పుట్టడం ఒక అద్భుతం,
మనిషిగా బ్రతకడం ఒక అదృష్టం.

జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పరవాలేదు,
కానీ అనుభవంతో చెప్పేవాడి మాట కచ్చితంగా వినాలి.

నీవు గెలవ గలిగితే ఒకరి నమ్మకాన్ని గెలిచి చూడు,
అంతకంటే గొప్ప గెలుపు మరొకటి ఉండదు.

గెలవాలని చేసే ప్రయత్నాన్ని ఆపేయడమే అతిపెద్ద వైఫల్యం.

లోచనలు పిరికిగా ఉంటే బ్రతుకు భారంగా ఉంటుంది.
అదే ఆలోచనలు గొప్పగా ఉంటే బ్రతుకు బ్రహ్మాండంగా ఉంటుంది.

హంకారం నెత్తికెక్కితే ఒక్కసారి స్మశానం వైపు చూడు, అక్కడ నీ కన్నా గొప్ప వారు మట్టిలో కలిసిపొయ్యారు.

నీ ఓటమికి గల కారణాలను నువ్వు ఎంత మందికి చెప్పినా ఎవరు వినరు.
కానీ నీ విజయ రహస్యాన్ని మాత్రం నిన్ను అడిగి మరీ తెలుసుకుంటారు.

యిదు మంది గురువుల కన్నా అనుభవమే జీవిత పాఠాలు బాగా నేర్పుతుంది.

సంకల్పబలం అంటే దీర్ఘకాలిక లక్ష్యాల కోసం స్వల్పకాలిక ఆనందం వదులుకోవడమే.

కేవలం విజయాలనుంచే కాదు, అపజయాల నుంచి కూడా మనము ఎదగడం నేర్చుకోవాలి.

జీవితంలో కష్టాల్ని దాటితేనే సంతోషాన్ని చూడగలము.

నీలో ధైర్యం ఉంటేనే ఎదగాలని కలలు కను. ఎందుకంటే ఆ కలను సాధించుకోవాలంటే ధైర్యం తప్పని సరిగా కావాలి.

దెబ్బతిన్న పులి అవకాశం కోసం ఎదురు చూస్తుంది.
అలాగే ఓటమి చెందిన మనిషి కూడా కసితో గమ్యాన్ని సాధించుకోవాలి.

ష్టం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితం మాత్రం అమృతంలా ఉంటుంది.

మోటివేషనల్ తెలుగు కోట్స్ ఇమేజెస్

Motivational Telugu Quotes in Telugu language
Motivational Telugu Quotes – మోటివేషనల్ తెలుగు కోట్స్

నవసరమైన మాటలు తగ్గిస్తే నీలో జ్ఞానం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది.

నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే, విజయం పది అడుగులు నీ ముందుకు వస్తుంది.

ష్టాలు వచ్చినప్పుడు సహనంతో ఉంటేనే జీవితం ప్రారంభం అవుతుంది.
కష్టాన్ని చూసి భయపడినప్పుడే దాని విలువ తెలుస్తుంది.
బాధ వచ్చినప్పుడే కన్నీటి విలువ తెలుస్తుంది.
కష్టాన్ని బాధను అనుభవించినప్పుడే జీవితపు విలువ తెలుస్తుంది.

గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ దొరుకుతాయని. అయినా దొరికేంతవరకు ఎగురు కుంటూ పోతుంది.
అలాగే మనము కూడా విజయం సాధించేంత వరకు ప్రయత్నిస్తూ ఉండాలి.

మెదడులో ఒక ఆలోచన పుట్టి, నీ మనసు ఆ ఆలోచనను నమ్మగలిగితే, దాన్ని ఖచ్చితంగా నువ్వు సాధించగలవు.

మిమ్మల్ని ప్రపంచం గుర్తించాలంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మాలి. ఆ నమ్మకమే మీకు విజయం చేకూరుస్తుంది. ఆ విజయాన్ని చూసి ప్రపంచమే మిమ్మల్ని కీర్తిస్తుంది.

ష్టం వచ్చిందని పారిపోతావో, పైకి పోతావో లేదా కష్టపడి ముందుకు పోతావో నీ చేతుల్లోనే ఉంటుంది.

జీవితంలో కొన్ని సార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు. కానీ నిజానికి ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పుతుంది.

This Post Has 5 Comments

  1. Some really great info, Gladiola I detected this. I’m not spaming. I’m just saying your website is AWSOME! Thank you so much! Please vist also my website.

Leave a Reply