You are currently viewing Nibba Nibbi Meaning In Telugu – నిబ్బా నిబ్బి అర్థాలు తెలుగులో

Nibba Nibbi Meaning In Telugu – నిబ్బా నిబ్బి అర్థాలు తెలుగులో

డిక్షనరీలో వెతికినా కూడా అర్థాలు దొరకని కొత్త పదాలు నిబ్బా – నిబ్బి. వీటి అర్థాలను ఈ Nibba Nibbi meaning in Telugu Post లో చూద్దాం.

ఇటీవలి కాలంలో మనకు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పదాలు Nibba(నిబ్బ), Nibbi(నిబ్బి). అలాగే ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ మొదలగు సోషల్ మీడియాలో మీమ్స్, జోక్స్ లలో ఈ నిబ్బ, నిబ్బి పదాలు ఏకంగా తమకంటూ ఒక కేటగిరి ఏర్పరుచుకున్నాయి. అయితే చాలా మందికి వీటి అర్థాలు తెలియక తికమక పడుతుంటారు. పూర్తి అర్థం తో పాటు, ఈ పదాలు వెనక ఉన్న స్టోరీని ఈ “Nibba Nibbi Meaning in Telugu Language” పోస్ట్ లో చూడండి.

Nibba Meaning in Telugu – నిబ్బా మీనింగ్ ఇన్ తెలుగు, నిబ్బ అర్థం తెలుగులో

నిబ్బా (Nibba) అనే పదాన్ని మనం ఎక్కువగా ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, పిన్టరెస్ట్ లాంటి సోషల్ మీడియా సైట్లలో తరచుగా చూస్తూనే ఉంటాం. ఈ నిబ్బా పదం అర్థంతో పాటు దాని వెనుక ఉన్న స్టోరీని చూద్దాం.

నిబ్బా (Nibba) అంటే పరిపక్వత లేని అబ్బాయి, పూర్తిగా ఎదగని అబ్బాయి, టీనేజ్ లో ఉన్న అబ్బాయి అని అర్థం.

Nibba Meaning In Telugu Language
Nibba meaning in Telugu

నిబ్బా పదం వెనుక ఉన్న కథ

నిబ్బా అనే పదం అమెరికాలో ఇతరులను హేళన చేసేందుకు ఎప్పటి నుంచో వాడుతున్నారు. అయితే అక్కడ స్త్రీ, పురుషులకు ఇరువురికి కేవలం నిబ్బా అనే పదాన్ని మాత్రమే వాడేవారు. మీమ్స్ లో మనుషుల బొమ్మల బదులు పిల్లి బొమ్మలను పెట్టి, వాటిని నిబ్బ అనే పేరుతో జోక్స్ వేసే వారు. ఈ నిబ్బా మీమ్స్ అన్ని దేశాలకు పాకింది.

Chapri Nibba Meaning In Telugu – చాప్రి నిబ్బా అర్థం తెలుగులో

చాప్రి అంటే చాప్రాసి అని అర్థం. మీమర్స్ కొంతమంది విచిత్రమైన టిక్ టాకర్లను ట్రోల్ చేసేందుకు చాప్రి నిబ్బా అనే పదాన్ని వాడుతున్నారు.

  • ఎవరైతే చిరిగిపోయిన జీన్స్ వేసుకొని, రంగు రంగుల కళ్ళద్దాలు పెట్టుకొని, బైకుల మీద రౌండ్లు వేస్తుంటారో వాళ్ళని చాప్రి నిబ్బాలు అంటారు.
  • పిచ్చి హెయిర్ స్టైల్ తో జుట్టు కి రంగు వేసుకొని అతి చేస్తుంటారో వాళ్ళని చాప్రి నిబ్బాలు అని అంటారు.
  • అమ్మాయిల ముందు అనవసరమైన కోతలు కోసేవారిని చాప్రి నిబ్బాలు అంటారు.

Nibbi Meaning in Telugu – నిబ్బి మీనింగ్ ఇన్ తెలుగు, నిబ్బి అర్థం తెలుగులో

నిబ్బి (Nibbi) పదం యొక్క అర్థంతో పాటు దీని వెనుక ఉన్న స్టోరీని చూద్దాం.

Nibbi = పరిపక్వత లేని అమ్మాయి, పూర్తిగా ఎదగని అమ్మాయి, టీనేజ్ లో ఉన్న అమ్మాయి

Nibba Meaning In Telugu Language

నిబ్బి పదం వెనుక కథ – నిబ్బి పదాన్ని కనిపెట్టిన భారతీయ మీమర్స్

భారతీయ మీమర్స్ (మీమ్ మేకర్స్) వారు రూపొందించే నిబ్బా మీమ్స్ పాఠకులకు పూర్తి అర్థమయ్యేలా ఉండాలని భావించారు. పిల్లి బొమ్మలను కాస్త మార్చి జోక్స్ క్రియేట్ చేశారు. మీమ్స్ లో ఆడపిల్లిని గుర్తు పట్టేందుకు వీలుగా దానికి బొట్టు పెట్టడం, చీరలో చూపించడం వంటివి చేయడం మొదలుపెట్టారు.



భారతీయులు స్త్రీలింగ – పుంలింగ పదాలకు ఎక్కువగా అలవాటుపడినట్టు గ్రహించారు మీమర్స్. నిబ్బ కి స్త్రీలింగం గా ఆడపిల్లికి నిబ్బి అని పేరు పెట్టి మీమ్స్ క్రియేట్ చేశారు. అలా ఇండియన్ మీమ్ మేకర్స్ మగ పిల్లిని నిబ్బ పేరుతో, ఆడపిల్లిని నిబ్బి పేరుతో పిలుస్తూ జోక్స్ క్రియేట్ చేయడం మొదలు పెట్టారు.

నిబ్బా నిబ్బి పదాలను ఏ సందర్భంలో వాడతారు?

ఈ Nibba Nibbi పదాలను ప్రేమ పైత్యం లో మునిగితేలుతున్న ప్రేమికులను, టీనేజ్ లో ఉన్న అబ్బాయిలను-అమ్మాయిలను ఉద్దేశించి వాడతారు. వీళ్లకు శరీరంతో పాటు బుద్ధి కూడా ఇంకా ఎదగలేదని, ప్రపంచాన్ని మర్చిపోయి వీరు చేసే ప్రేమ పైత్యపు పనుల గురించి చెప్పే సందర్భాల్లో వెటకారంగా నిబ్బ-నిబ్బి పదాలను వాడతారు.

Nibba Nibbi Jokes In Telugu – నిబ్బా నిబ్బి మీమ్స్, జోక్స్

Nibba Nibbi Jokes explains Nibba meaning in telugu
Nibba Nibbi Jokes in Telugu explains Nibba meaning in Telugu

(Image Credits goes to the original meme creators and social media platform. The original memes were just re-edited to fit on our website.)



అయితే మీమర్స్ ఈ నిబ్బ – నిబ్బి మీమ్స్, జోక్స్ ను ఎక్కువగా ప్రేమలో ఉండి, తెలివితక్కువగా వ్యవహరించే ప్రేమికులను ఉద్దేశించి ట్రోల్ చేస్తూ మీమ్స్ ని క్రియేట్ చేశారు‌. ఈ మీమ్స్ బాగా పాపులర్ అవ్వడంతో అన్ని భాషల్లోనూ గత రెండు సంవత్సరాలుగా వీటి హవా సోషల్ మీడియాలో కొనసాగుతోంది. తెలివితక్కువ ప్రేమికులను, పరిపక్వత లేని అమ్మాయిలు-అబ్బాయిలను నిబ్బ-నిబ్బి అనే పిల్లుల బొమ్మల రూపంలో ట్రోల్ చేస్తుంటారు.

Leave a Reply