You are currently viewing తెలుగుదేశం పార్టీ కి వచ్చిన ఓట్లు 54, 55, 56, 65, 71, 82, 91, ….

తెలుగుదేశం పార్టీ కి వచ్చిన ఓట్లు 54, 55, 56, 65, 71, 82, 91, ….

తెలుగుదేశం పార్టీ కి వచ్చిన ఓట్లు 54, 55, 56, 65, 71, 82, 91, 99,…

గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యంత భారీ ఓటమిని చవిచూసింది. తెలుగుదేశం పార్టీ కి వచ్చిన ఓట్లు 54, 55, 56, 65, 71, 82, 91, 99 మొదలైనవి చూస్తే నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల ర్యాంకుల లాగానే ఉన్నాయని ఆల్రెడీ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లను కోల్పోయింది.

మొదటి అరవై వార్డుల్లో తెదేపా కి అత్యధిక ఓట్లు(946) బి.యన్.రెడ్డి నగర్ లో వచ్చాయి. అలాగే అత్యల్ప ఓట్లు(54) ఘన్సీబజార్ లో వచ్చాయి. మొదటి అరవై వార్డుల్లో తెదేపా కి వచ్చిన ఓట్లు క్రింద పట్టికలో చూడవచ్చు.

వార్డు నంబర్వార్డు పేరుతెలుగుదేశం పార్టీ కి వచ్చిన ఓట్లు
01కాప్రా788
02ఎ. యస్. రావు నగర్738
03చెర్లపల్లి606
04మీర్ పేట్ —-
05మల్లాపూర్584
06నాచారం—-
07చిలకా నగర్279
08హబ్సీగూడ—-
09రామాంతపూర్274
10ఉప్పల్—-
11నాగోల్504
12మన్సూరాబాద్434
13హయత్ నగర్801
14బి. యన్. రెడ్డి నగర్946
15వనస్థలిపురం772
16హస్తినాపురం242
17చంపాపేట్278
18లింగోజీగూడ564
19సరూర్ నగర్406
20రామకృష్ణాపురం363
21కొత్తపేట645
22చైతన్యపురి488
23గడ్డి అన్నారం329
24సైదాబాద్—-
25మూసారాంబాగ్—-
26ఓల్డ్ మలక్ పేట్—-
27అక్బర్ బాగ్99
28ఆజంపుర—-
29చవని (చవ్ని)—-
30డబీర్ పురా91
31రెయిన్ బజార్56
32పతేర్ గట్టి—-
33మొఘల్ పురా—-
34తలాబ్ చంచలం65
35గౌలిపురా111
36లలిత బాగ్—-
37కూర్మగూడ55
38ఐ. యస్. సదన్227
39సంతోష్ నగర్—-
40రియాసత్ నగర్—-
41కంచన్ బాగ్—-
42బర్కాస్—-
43చాంద్రాయణ గుట్ట174
44ఉప్పుగూడ—-
45జంగంమెట్—-
46ఫలక్ నామా—-
47నవాబ్ సాహెబ్ కుంట—-
48షాలిబండ160
49ఘన్సీబాద్54
50బేగం బజార్175
51గోషా మహల్165
52పురాణాపూల్—-
53దూద్ బౌలి82
54జహానుమా—-
55రమనాసత్ పురా—-
56కిషన్ బాగ్71
57సులేమాన్ నగర్—-
58శాస్త్రిపురం—-
59మైలార్ దేవ్ పల్లి—-
60రాజేంద్ర నగర్328
గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కి వచ్చిన ఓట్లు
  • తెదేపా పోటీ చేసిన అన్ని వార్డుల్లో డిపాజిట్లను కోల్పోయింది.
  • సీమాంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉన్న కేపీహెచ్బి, చందానగర్ చుట్టుపక్కల వార్డుల్లో మెరుగైన ప్రదర్శన కనబరచిన డిపాజిట్లను మాత్రం రాబట్టుకోలేక పోయింది.
  • కొన్ని వార్డుల్లో తెదేపా అభ్యర్థుల కంటే ఇండిపెండెంట్ లకే ఎక్కువ ఓట్లు వచ్చాయి.

ఈ ఎన్నికల ఫలితాలతో ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా అంతరించి పోయిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని చెప్పే చంద్రబాబుకు అదే హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో తెదేపాకు డిపాజిట్లు గల్లంతయ్యేలా చేశారు గ్రేటర్ ఓటర్లు.

Leave a Reply