అక్టోబర్ నెలలో తెలుగు మూవీస్ శాటిలైట్ రైట్స్ (Telugu Movies Satellite Rights) బిజినెస్ ఏ విధంగా జరిగిందో ఒకసారి చూద్దాం. తెలుగు టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ లో స్టార్ మా తన దూకుడును ప్రదర్శిస్తోంది. ఈ సారి GEC (General Entertainment Channels) క్యాటగిరిలో తెలుగు లోనే కాక మొత్తం అన్ని రీజనల్ లాంగ్వేజెస్ లోనూ స్టార్ మా నెంబర్ వన్ గా అవతరించింది. కానీ ఆదివారం సినిమా విషయానికి వస్తే జెమిని టీవీ ముందు స్టార్ మా చతికిల పడుతోంది. ఇందుకు కారణం, జెమిని టీవీ తెలుగు మూవీస్ శాటిలైట్ రైట్స్ (Telugu Movies Satellite Rights) కోసం భారీగా డబ్బు వెచ్చిస్తుంది. జెమిని టీవీలో ప్రీమియర్ అయ్యే సినిమాలకైతే TRP రేటింగ్స్ భారీగా నమోదవుతున్నాయి.
ఆర్ఆర్ఆర్, పుష్ప, సర్కారు వారి పాట, ఆచార్య తెలుగు మూవీస్ శాటిలైట్ రైట్స్ స్టార్ నెట్వర్క్ సొంతం చేసుకుందా? – Did Star Network Purchase RRR, Pushpa, Sarkaru Vaari Paata, Aacharya Telugu Movies Satellite Rights?
ఈ సారి స్టార్ నెట్వర్క్ తన స్ట్రీమింగ్ పార్ట్నర్ అయిన డిస్నీ హాట్ స్టార్ తో కలిసి తెలుగు మూవీస్ శాటిలైట్ రైట్స్ కోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. తెలుగులో నిర్మితమౌతున్న పాన్ ఇండియన్ మూవీస్ అయిన ఆర్ఆర్ఆర్, పుష్ప, ఆచార్య, సర్కారు వారి పాట సినిమాల రైట్స్ ను భారీ ఆఫర్లు ఇచ్చి స్టార్ నెట్వర్క్ చేజిక్కించుకుంది అని సమాచారము. ఈ సినిమాలకు సంబంధించిన అన్ని భాషల శాటిలైట్ రైట్స్ మరియు డిజిటల్ రైట్స్ పూర్తిగా స్టార్ నెట్వర్క్, డిస్నీ హాట్ స్టార్ సొంతం చేసుకున్నాయని సమాచారము. అలాగే చావు కబురు చల్లగా చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా, డిజిటల్ రైట్స్ ని ఆహా చేజిక్కించుకున్నాయి.
వకీల్ సాబ్, RED (రెడ్), #BB3 (బాలయ్య – బోయపాటి కాంబో) తెలుగు మూవీస్ శాటిలైట్ రైట్స్ ని జెమిని టీవీ సొంతం చేసుకుందా? – Did Gemini TV Obtain Vakeel Saab, RED, Balayya Babu’s BB3 Telugu Movies Satellite Rights?
వకీల్ సాబ్, RED (రెడ్) , #BB3 (బాలయ్య – బోయపాటి కాంబో) తెలుగు మూవీస్ శాటిలైట్ రైట్స్ ని జెమిని టీవీ సొంతం చేసుకుంది.
- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రాండ్ మూవీ వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ ని జెమిని టీవీ ఏకంగా 16.50 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకుంది.
- బాలయ్య బాబు, బోయపాటి కాంబో లో రూపు దిద్దుకుంటున్న #BB3 తెలుగు మూవీ టీవీ రైట్స్ ని జెమిని టీవీ 11.5 కోట్ల రూపాయలకు చేజిక్కించుకుంది.
- రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ RED రిలీజ్ కు సిద్దంగా ఉంది. తమిళ్ నుంచి రీమేక్ అయిన RED తెలుగు మూవీ శాటిలైట్ రైట్స్ ని కూడా జెమిని టీవీ సొంతం చేసుకుంది.
- నాని, సుధీర్ బాబు నటించిన V చిత్రాన్ని ఈ దీపావళి పండుగ సీజన్లో వరల్డ్ వైడ్ ప్రీమియర్ చేయనుంది జెమిని టీవీ. V చిత్రం తో పాటు అల వైకుంఠపురములో, దొరసాని చిత్రాలను టెలికాస్ట్ చేయనుంది జెమిని టీవీ.
జీ టీవీ సొంతం చేసుకున్న తెలుగు మూవీస్ శాటిలైట్ రైట్స్
మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైం బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు చానెల్ మళ్ళీ రెన్యూ చేసుకుంది.
జీ తెలుగు లో నవంబర్ 8వ తేదీన పెంగ్విన్ మూవీ ని వరల్డ్ వైడ్ ప్రీమియర్ చేయనుంది.
ఆర్ఆర్ఆర్, పుష్ప, సర్కారు వారి పాట, ఆచార్య తెలుగు మూవీస్ సాటిలైట్ రైట్స్ ద్వారా స్టార్ మా ఆదివారం సినిమా టైం లోను భారీ TRP రేటింగ్స్ నమోదు చేయడంలో సందేహం లేదు.