You are currently viewing Torch Bearer Meaning In Telugu – టార్చ్ బేరర్ అర్థం తెలుగులో

Torch Bearer Meaning In Telugu – టార్చ్ బేరర్ అర్థం తెలుగులో

అరవింద సమేత వీర రాఘవ సినిమాలో “వాడు టార్చ్ బేరర్ లాంటోడు రా” అనే డైలాగ్ ఎంత ప్రాచుర్యం పొందిందో మనందరికీ తెలుసు. కానీ ఈ టార్చ్ బేరర్ అనే పదం యొక్క అర్థం చాలా మందికి తెలియదు. టార్చ్ బేరర్ యొక్క అర్థం తో పాటు ఎవరిని ఉద్దేశించి వాడుతారో, ఉదాహరణలతో సహా ఈ Torch Bearer (torchbearer) Meaning In Telugu Post లో చూద్దాం.

Torch Bearer (Torchbearer) Meaning In Telugu – టార్చ్ బేరర్ మీనింగ్ ఇన్ తెలుగు

Torch Bearer (torchbearer) అంటే మార్గదర్శి, దార్శనికుడు, దిశానిర్దేశం చేయువాడు, దారి చూపు వాడు, అగ్గి దివిటీలు మోసే వాడు అని చాలా అర్థాలు వస్తాయి.

ఇక్కడ టార్చ్ బేరర్ అనేది ఏకవచన పదం. ఒకరిని ఉద్దేశించి మాత్రమే చెప్పే సందర్భంలో వాడుతారు. Torch Bearer కి బహువచన పదం torch bearers. కావున టార్చ్ బేరర్స్ (torch bearers) అనే పదాన్ని ఇద్దరిని లేదా అంతకుమించి ఎక్కువ మందిని ఉద్దేశించి చెప్పే క్రమంలో వాడుతారు.

టార్చ్ బేరర్ (Torch Bearer) అనేవి జంటపదాలు అయినప్పటికీ, చాలా మంది ఒకే పదంగా torchbearer అని వాడుతున్నారు.

టార్చ్ బేరర్ అనే పదాన్ని ఎవరిని ఉద్దేశించి వాడుతారు?

  • మంచి లక్ష్యసాధన కోసం జరిగే ఉద్యమాన్ని ఎవరైతే ముందుండి నడిపిస్తారో, వారిని టార్చ్ బేరర్స్ ఉంటారు.
  • అంధకారంలో జీవిస్తున్న వారి జీవితాల్లో ఎవరైతే వెలుగులు నింపుతారో, వాళ్ళను టార్చ్ బేరర్స్ అంటారు.
  • ఎవరి జీవితం అయితే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోందో, వాళ్లను టార్చ్ బేరర్స్ అంటారు.
  • ఇతరులను గమ్యం చేర్చేందుకు ఎవరైతే దిశానిర్దేశం చేసి సఫలీకృతులు అవుతారో, వాళ్ళను టార్చ్ బేరర్స్ అంటారు.

Torch Bearer Examples With Telugu Meaning – టార్చ్ బేరర్ ఉదాహరణలు

Mahatma Gandhi is the torch bearer in Indian Freedom Movement.
భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారు మార్గదర్శి.
torch bearer example with meaning in Telugu

Potti Sri Ramulu is the torchbearer in Andhra Pradesh state formation.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావంలో పొట్టి శ్రీరాములు గారు మార్గదర్శి.
torchbearer example with meaning in Telugu

Mother Teresa is the torch bearer in spreading humanity.
మానవ సేవలో మదర్ తెరిసా దార్శనికురాలు.

There should be a torch bearer if you are travelling at night in a forest.
రాత్రి పూట అడవుల్లో ప్రయాణిస్తున్నప్పుడు, అగ్గి దివిటీలు మోసేవారు తప్పనిసరిగా ఉండవలెను.
(అగ్గి దివిటీలు మోసే వారు ధైర్యంగా దారి చూపుతారు. ఏదైనా ఆపద వస్తే ముందుండి ఎదుర్కొంటారు అనే నమ్మకం)

In Merchant Of Venice, Jessica is the torch bearer.
మర్చెంట్ ఆఫ్ వెన్నీస్ నవలలో జెస్సికా టార్చ్ బేరర్.

Tata, Birla, ITC, Godrej groups are the torch bearers in Indian Industrial Sector.
భారతదేశ పరిశ్రమల విభాగంలో టాటా, బిర్లా, ఐటిసి, గోద్రెజ్ గ్రూపులు మార్గదర్శక దిగ్గజాలు.
Torch Bearers example with meaning in Telugu language

Leave a Reply