Triglycerides Meaning In Telugu – ట్రైగ్లిజరాయిడ్స్ గురించి తెలుగులో

Triglycerides Meaning In Telugu – ట్రైగ్లిజరాయిడ్స్ గురించి తెలుగులో

Triglycerides Meaning In Telugu Language – ట్రైగ్లిజరాయిడ్స్ మీనింగ్ ఇన్ తెలుగు: ట్రైగ్లిజరైడ్స్ అంటే మానవుని శరీరంలో ప్రవహించే రక్తం లోని ఒక రకమైన కొవ్వు పదార్థాలు. మనం తీసుకునే ఆహారంలోని కొవ్వు పదార్థాలు మొదట కొవ్వు కణాలలో ట్రైగ్లిజరైడ్లల రూపంలో నిల్వ చేయబడతాయి. ఆ తరువాత క్రమేపీ రక్త ప్రవాహంలోకి ఈ కొవ్వు పదార్థాలు విడుదలవుతాయి. మనం కొలెస్ట్రాల్ కు సంబంధించిన లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ (LPT – Lipid Profile Test) పరీక్ష చేయించుకుంటే ట్రైగ్లిజరైడ్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది. గూగుల్ ట్రాన్స్లేషన్ (అనువాదం) లో triglycerides meaning in telugu ని త్రిగలిసిరిదేస్ మీనింగ్ ఇన్ తెలుగు అని తప్పుగా చూపిస్తోంది. త్రిగలిసిరిదేస్ అంటే ట్రైగ్లిజరాయిడ్స్ అని గమనించగలరు.




Hyper Triglycerides Meaning In Telugu – హైపర్ ట్రైగ్లిజరాయిడ్స్ అంటే ఏమిటి?

రక్త ప్రసరణ జరిగే క్రమంలో మన రక్తంలో ట్రైగ్లిజరైడ్లు అధిక స్థాయిలో ఉంటే, వాటిని హైపర్ ట్రైగ్లిజరైడ్స్ అని అంటారు. ఇవి మన శరీరానికి హాని కలిగిస్తాయి. వీటి ప్రభావం మనిషి శరీరంలోని లివర్ పైన మరియు ప్యాంక్రియాస్ పైన అధికంగా ఉంటుంది.

Triglycerides Levels – ట్రైగ్లిజరాయిడ్స్ లెవెల్స్

మనిషి శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ ఏ మోతాదులో ఉన్నాయో తెలుసుకోవాలంటే లిపిడ్ ప్రొఫైల్ టెస్టు చేయించుకోవాలి. ఈ పరీక్షలో ట్రైగ్లిజరైడ్ల మోతాదును తెలియజేసేందుకు నాలుగు భాగాలుగా విభజించారు. ఆ నాలుగు భాగాల గురించి క్రింద వివరించడం జరిగింది.

(I) Normal Level – సాధారణ లెవెల్

మనకు LPT రిపోర్టులో ట్రైగ్లిజరైడ్లు మోతాదు 150 mg/dL కంటే తక్కువగా నమోదైతే, దానిని సాధారణంగా పరిగణించవచ్చు. రక్తంలో ట్రైగ్లిజరైడ్లు సాధారణ స్థితిలో ఉంటే, రక్త ప్రసరణ విషయంలో మనం పూర్తి ఆరోగ్యంగా ఉన్నామని అర్థం.



(II) Border Line Level – బోర్డర్ లైన్ లెవెల్

ట్రైగ్లిజరైడ్లు మోతాదు 150 mg/dL నుంచి 199 mg/dL మధ్యలో నమోదైతే, దానిని బోర్డర్ లైన్ లెవెల్ గా పరిగణించాలి. ఈ బోర్డర్ లైన్ లెవెల్ లో ట్రైగ్లిజరైడ్లు సాధారణ స్థితి కన్నా కాస్త ఎక్కువగానే ఉన్నాయని అర్థం. రక్త ప్రసరణ విషయంలో ఇది మనకు మొదటి ప్రమాద హెచ్చరిక లాంటిది.

(III) High Level – హై లెవెల్

ట్రైగ్లిజరైడ్లు మోతాదు 200 mg/dL నుంచి 499 mg/dL మధ్యలో నమోదైతే, దానిని హై లెవెల్ గా పరిగణించాలి. అంటే రక్తంలో ట్రైగ్లిజరైడ్ల మోతాదు సాధారణ స్థితి కన్నా చాలా ఎక్కువగా ఉందని అర్థం. రక్త ప్రసరణ వ్యవస్థలో ఆటంకాలు కలుగుతుంటాయి. ఇది ప్రమాదకరం అని భావించాలి. హై లెవెల్ లో ట్రైగ్లిజరైడ్లు ఉన్నట్లయితే, డాక్టర్ సలహాలను తప్పనిసరిగా పాటించాలి.




(IV) Very High Level – వెరీ హై లెవెల్

ట్రైగ్లిజరైడ్లు మోతాదు 500 mg/dL కంటే ఎక్కువగా నమోదైతే, దానిని హై లెవెల్ గా పరిగణించాలి. రక్తంలో ట్రైగ్లిజరైడ్లు శాతం చాలా అధికంగా ఉందని, ఏకంగా రక్త ప్రసరణ విషయంలో తీవ్రమైన ఆటంకాలు కలుగుతుంటాయని గమనించాలి. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఈ లెవెల్ లో ట్రైగ్లిజరైడ్లు ఉన్నట్లయితే రక్తపోటు, గుండెపోటు, భరించలేని కడుపు నొప్పి, లివర్ మరియు ప్యాంక్రియాస్ సంబంధింత వ్యాధులు కలుగుతాయి. డాక్టర్ గారి సలహాలను పాటించడంలో ఏ కొంచెం నిర్లక్ష్యం చేసినా ప్రాణానికే ప్రమాదం.