You are currently viewing తెలుగు మూవీ న్యూస్: 100 కోట్ల షేర్ క్లబ్ లో వకీల్ సాబ్ – వకీల్ సాబ్ కు తప్పని తిప్పలు

తెలుగు మూవీ న్యూస్: 100 కోట్ల షేర్ క్లబ్ లో వకీల్ సాబ్ – వకీల్ సాబ్ కు తప్పని తిప్పలు

వంద కోట్ల షేర్ క్లబ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్.
వకీల్ సాబ్ కు తప్పని తిప్పలు.

ఏప్రిల్ 9వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం వకీల్ సాబ్. మొదటి ఆట నుంచే పూర్తి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో వకీల్ సాబ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరూ భావించారు. దీనికి అనుగుణంగానే వకీల్ సాబ్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ భారీ స్థాయిలో రాబట్టుకుంది. కొన్ని చోట్ల ఏకంగా బాహుబలి 2 రికార్డులను కూడా అధిగమించింది. ఈ చిత్రం సునాయాసంగా నాన్ బాహుబలి 2 రికార్డులను అన్నింటిని అధిగమిస్తుందని అందరూ భావించారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఈ చిత్రం సృష్టించబోయే రికార్డులపై కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే సెకండ్ వేవ్ కారణంగా పరిస్థితులన్నీ తారుమారు అయ్యాయి. 18వ తేదీన 100 కోట్ల షేర్ మైలు రాయిని దాటింది ఈ చిత్రం.


2021 మొదటి మూడు నెలలు మెరిసిన తెలుగు సినిమా

ప్రస్తుతం భారత దేశంలో అత్యధిక సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న చిత్ర రంగం ఏదైనా ఉందంటే, అది టాలీవుడ్ అనే చెప్పాలి. ఈ కరోనా కాలంలో కూడా ప్రేక్షకులు తెలుగు సినిమాను అంతలా ఆదరిస్తున్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలను ఆదరించారు. క్రాక్, ఉప్పెన, నాంది, జాంబి రెడ్డి, జాతి రత్నాలు సినిమాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. అయితే ఈ ఆదరణ మార్చి నెల వరకే పరిమితం అయ్యింది.

ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యం
మార్చి నెల నుంచి మహారాష్ట్రలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఏప్రిల్ నెల నుంచి తెలుగు రాష్ట్రలు కూడా కోవిడ్ సెకెండ్ వేవ్ బారిన పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో జ్వరాల బారిన పడుతున్న మనుషుల సంఖ్య రోజు రోజుకు రెట్టింపు అవుతుంది. దీంతో చాలా మంది ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షికార్లకు, సినిమాలకు, మీటింగ్ లకు దూరంగా ఉంటున్నారు. సినిమాల పరంగా ప్రేక్షకుడి ఆలోచనా సరళి కూడా ఏప్రిల్ లో మారింది. అలాగే తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని చూస్తే ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఓటింగ్ లో పాల్గొనలేదని తెలుస్తోంది. అలాగే చాలా మంది ప్రేక్షకులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వకీల్ సాబ్ సినిమాకు కాస్త దూరంగానే ఉన్నారని స్పష్టంగా అర్థం అవుతోంది.వకీల్ సాబ్ కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోన్న సెకండ్ వేవ్
ఈ సెకెండ్ వేవ్ ప్రభావం వకీల్ సాబ్ సినిమా పైన బాగానే పడుతోంది. మొదటి మూడు రోజులు కలెక్షన్ల వర్షం కురిపించిన వకీల్ సాబ్ చిత్రం, నాలుగవ రోజు నుంచి కాస్త జోరు తగ్గించింది. కుటుంబ సమేతంగా సినిమాకు వచ్చే వారి సంఖ్య భారీగా పడిపోయింది. వకీల్ సాబ్ సినిమా చూడాలన్న ఆశ తమకి ఉన్నా, సినిమా థియేటర్లకి వెళ్లి చూసే సాహసం ప్రస్తుతం చెయ్యలేమని కామెంట్స్ పెడుతున్నారు కొందరు నెటిజన్లు. ప్రేక్షకులు థియేటర్లకు కాస్త దూరంగా ఉన్నారని గ్రహించే లవ్ స్టొరీ, విరాట పర్వం, టక్ జగదీష్ చిత్రాల విడుదలను వాయిదా వేసుకున్నారు నిర్మాతలు.
మొత్తానికి వకీల్ సాబ్ కలెక్షన్లకు కరోనా సెకండ్ వేవ్ గట్టి దెబ్బే కొడుతోందని చెప్పాలి. ఈ పది రోజుల్లో ఎంత లేదన్నా 40 కోట్ల రూపాయల అదనపు షేర్ ను వకీల్ సాబ్ కోల్పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. పరిస్థితులు ఇలానే ఉంటే, వకీల్ సాబ్ చిత్రం పూర్తి రన్ లో మరో 20 కోట్ల షేర్ ను రాబట్టుకోవడం కూడా చాలా కష్టమే.

Leave a Reply