Vibes Meaning In Telugu Language – వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు, వైబ్స్ అర్థం తెలుగులో
వైబ్స్ (Vibes) అనేే పదాన్ని ఒక వ్యక్తి లేదా ప్రదేశం యొక్క మూడ్ ని తెలియజేసేందుకు వాడతాము. చాలా వెబ్ సైట్లు వైబ్స్ అంటే ప్రకంపనలు అని ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ చేసి చెప్పాయి. కానీ ప్రకంపనలు అనేది కేవలం వైబ్రేషన్స్ (vibrations) కు మాత్రమే అర్థం. Vibes meaning in Telugu = అనుభూతి, వాతావరణం, అనుభవం, భావం.
ఒక మనిషి యొక్క అంతరంగిక భావాన్ని లేదా ఒక ప్రదేశం యొక్క వాతావరణాన్ని మనము స్పష్టంగా అనుభవించడాన్ని వైబ్స్ అంటారు. వైబ్స్ అనేవి ఎక్కువ శాతం మంచి అనుభూతిని ఇచ్చినా, కొన్ని మాత్రం చెడు అనుభూతిని కలిగిస్తాయి.
వైబ్స్ లో వివిధ రకాలు మరియు వాటి అర్థాలు – Different Types Of Vibes In Telugu
మనము చాలా రకాల వైబ్స్ ను ఎప్పటి నుంచో తెలుగులో ప్రత్యేక పదాలతో వాడుతున్నాము.
(1) Marriage Vibes Meaning In Telugu – మ్యారేజ్ వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు
Marriage Vibes అంటే పెళ్లి కళ అని అర్థం. పెళ్ళికూతురు కి, పెళ్ళికొడుకు కి పెళ్లి కళ వచ్చింది అని చెప్పే సందర్భంలో మ్యారేజ్ వైబ్స్ పదాన్ని వాడతారు.
(2) Wedding Vibes Meaning – వెడ్డింగ్ వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు
Wedding Vibes అంటే పెళ్లి వాతావరణం అని అర్థం. ఒక ఇంట్లో పెళ్లి వాతావరణం నెలకొంది అంటే కుటుంబ సభ్యులంతా పండుగ లాగా సంతోషంతో జరుపుకుంటారు.
(3) Morning Vibes Meaning In Telugu – మార్నింగ్ వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు
Morning Vibes అంటే ఆహ్లాదకరమైన వాతావరణం అని అర్థం. సూర్యోదయం సమయంలో వాతావరణం నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఆహ్లాద భరితంగా ఉంటుంది.
(4) Positive Vibes – పాజిటివ్ వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు
Positive Vibes అంటే శుభప్రదమైన వాతావరణం అని అర్థం. వీటిని positive vibrations అని కూడా అంటారు.
(5) Birthday Vibes Meaning In Telugu – బర్త్ డే వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు
Birthday Vibes అంటే పుట్టిన రోజు నాడు నెలకొనే వాతావరణం అని అర్థం వస్తుంది. బ్యాచిలర్స్ దృష్టిలో బర్త్ డే వైబ్స్ ఒక రకమైన అనుభూతిని కలిగిస్తే, ఇంట్లో జరిగే బర్త్ డే పార్టీలు మరో రకమైన అనుభూతిని కలిగిస్తాయి.
(6) Bad Vibes Meaning In Telugu – బ్యాడ్ వైబ్స్ మీనింగ్ ఇన్ తెలుగు
Bad Vibes అంటే చెడు జ్ఞాపకాలు, చెడు వాతావరణం అని అర్థం వస్తుంది. ఇతర వ్యక్తుల వల్ల కలిగిన చేదు అనుభవాలను గుర్తుకు తెచ్చుకోవడం బ్యాడ్ వైబ్స్ క్రిందికి వస్తాయి. అలాగే ఏదైనా ఒక ప్రాంతంలో జరిగిన చెడు సంఘటనలు కూడా బ్యాడ్ వైబ్స్ క్రిందికి వస్తాయి.

వైబ్స్ యొక్క ఉదాహరణలు – Vibes Meaning With Examples
We can experience village vibes at Shilparamam in Hyderabad. |
హైదరాబాద్ లోని శిల్పారామంలో మనం పల్లెటూరి వాతావరణాన్ని అనుభవించవచ్చు. |
Goa is famous for it’s beautiful beach vibes. |
అందమైన బీచ్ ల సవ్వడి కి గోవా ప్రసిద్ధి. |
I lost myself while experiencing the temple vibes of Gokarna. |
గోకర్ణ ఆలయ సౌందర్యానికి నేను మంత్రముగ్ధుడిని అయ్యాను. |
I experienced bad vibes in this restaurant. |
ఈ రెస్టారెంట్ లో నేను చేదు అనుభవాలను చవిచూశాను. |
We vibe so well. |
మాకు లంకె బాగా కుదిరింది. (ఒకరి అభిప్రాయాలు మరొకరితో సరిపోయాయి అని చెప్పే సందర్భం) |