Wonderla Hyderabad Ticket Price Discount Offers – వండర్ లా హైదరాబాద్ డిస్కౌంట్ ఆఫర్స్

విద్యార్థుల కోసం వండర్ లా హైదరాబాద్ వండర్ఫుల్ డిస్కౌంట్ ఆఫర్స్

హైదరాబాద్ లోని వండర్ లా కాలేజీ విద్యార్థుల కోసం ఒక అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద విద్యార్థులకు టికెట్ పైన 15% డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ఆఫర్ కళాశాలల్లో చదివే 2020-2021 సంవత్సరపు విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ మార్చి 31తో ముగుస్తుంది. వండర్ లా థీమ్ పార్క్ లో రోజంతా గడిపేందుకు ఎంట్రీ టికెట్ ధర జిఎస్టితో కలిపి 849 రూపాయలు అవుతుంది. ఈ ఆఫర్ ను పొందాలనుకునే విద్యార్థులు టికెట్ కౌంటర్ వద్ద తమ కాలేజీ ఐడీ కార్డు ని చూపించి డిస్కౌంట్ ను పొందవచ్చు. ప్రస్తుతం వండర్ లా థీమ్ పార్క్ బుధవారం నుంచి ఆదివారం వరకు తెరిచి ఉంటుంది.

విద్యార్థులు రోజంతా తమ స్నేహితులతో ఆహ్లాదంగా గడిపేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని మేనేజ్మెంట్ తెలిపింది. థీమ్ పార్కులో రద్దీ ప్రాంతాలైన రెస్టారెంట్ల దగ్గర, కియోస్కుల దగ్గర మరియు ఇతర కౌంటర్ల దగ్గర సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు వీలుగా మార్కింగ్ చేశారు. అన్ని రైడ్లను ప్రభుత్వం ఆమోదించిన రసాయనాలతో శుభ్రపరుస్తున్నామని చెప్పారు. అన్ని రెస్టారెంట్ల ఎంట్రెన్స్ వద్ద, రైడ్ల వద్ద, చేంజ్ రూముల వద్ద ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచామన్నారు. నీటిలో క్లోరిన్ శాతాన్ని ఆన్లైన్ కెమికల్ డోసింగ్ ద్వారా నిర్వహిస్తున్నామన్నారు.

Leave a Reply