You are currently viewing వైఎస్ఆర్ పెన్షన్ కానుక పూర్తి వివరాలు – YSR Pension Kanuka Full Details In Telugu

వైఎస్ఆర్ పెన్షన్ కానుక పూర్తి వివరాలు – YSR Pension Kanuka Full Details In Telugu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా అమలు పరుస్తోన్న పథకాలల్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక [ YSR Pension Kanuka ] అతి ముఖ్యమైనది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కి సంబంధించిన సమగ్ర వివరాలను అందరికి అర్థమయ్యే విధంగా తెలుగులో అందిస్తున్నాము.

  • వైఎస్ఆర్ పెన్షన్ కానుక క్రింద మొత్తం ఎన్ని రకాల ఫించన్లు ఉన్నాయి?
  • ఏ ఫించనుకి ఎంత డబ్బు వస్తుంది?
  • ఫించన్లు పొందేందుకు అర్హతలు ఏంటి?


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కి సంబంధించిన YSR Pension Kanuka లోని ఏ ఫించన్లకైనా అప్లై చేయాలంటే ఉండాల్సిన కనీస అర్హతలు:

  • అప్లికెంట్(లబ్ధి పొందాలనుకునే వారు) కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన దారిద్య్ర రేఖకు [BPL - Below Poverty Line] దిగువనున్న వారై వుండాలి.
  • అప్లికెంట్ కుటుంబానికి తప్పని సరిగా తెల్ల రేషన్ కార్డు మంజూరు అయ్యి ఉండాలి.
  • అప్లికెంట్ ఏ జిల్లాలో అయితే అప్లయ్ చేస్తాడో, ఆ జిల్లాకు చెందిన లోకల్ రెసిడెంట్ (నివాసి) అయ్యి ఉండాలి.
  • వివిధ ఫించన్లకు అర్హత ఉన్నా కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకరికి ఒక ఫించను మాత్రమే అనుమతిస్తుంది. కనుక ఒక అప్లికెంట్ ఒక ఫించనుకు మాత్రమే అర్హుడు.

పైన వివరించిన కనీస అర్హతలతో పాటు వివిధ ఫించన్లకు అవసరమైన ఇతర అర్హతలు ఈ విధంగా ఉన్నాయి.

[adinserter block="1"]

(1) ఓల్డ్ ఏజ్ పెన్షన్ - వృద్ధాప్య ఫించను [OAP - Old Age Pension]

  • ఓల్డ్ ఏజ్ పెన్షన్ అంటే వృద్ధాప్య ఫించను.
  • 60 సంవత్సరముల వయస్సు పైబడిన వారు అయ్యి వుండాలి.
  • పూర్తిగా నిరాశ్రయులైన అనాధ వృద్ధులు, జీవనాధారము లేని ఒంటరి వృద్ధులు మాత్రమే అర్హులు.

(2) చేనేత కార్మికుల ఫించను [Weavers Pension]

  • వీవర్స్ పెన్షన్ అంటే చేనేత కార్మికుల ఫించను.
  • 50 సంవత్సరముల వయస్సు పైబడిన చేనేత కార్మికులై ఉండాలి.

[adinserter block="5"]

(3) వితంతు ఫించను [Widow Pension]

Widow Pension || YSR Pension Kanuka || వితంతు ఫించను
వితంతు ఫించను - Widow Pension, YSR Pension Kanuka
  • విడో పెన్షన్ అంటే వితంతు ఫించను.
  • 18 సంవత్సరములు పైబడిన వితంతువులు అయ్యి వుండాలి.
  • వీరికి వివాహ చట్ట ప్రకారం పెళ్ళి అయినట్లు డాకుమెంట్ సమర్పించాలి.
  • అలాగే భర్త చనిపోయినట్టు ధృవీకరణ పత్రం సమర్పించాలి.

(4) వికలాంగుల ఫించను [Disabled Pension]

  • డిసేబుల్డ్ పెన్షన్ అంటే వికలాంగుల ఫించను.
  • వీరికి అంగవైకల్యం కనీసం 40% వుండ వలెను.
  • వీరి వయస్సు పై ఎటువంటి పరిమితులు లేవు.
  • అంగవైకల్యం కి సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్ సమర్పించాలి.



(5) కల్లుగీత కార్మికుల ఫించను [Toddy Tappers Pension]

  • టాడీ ట్యాపర్స్ పెన్షన్ అంటే కల్లుగీత కార్మికుల ఫించను.
  • 50 సంవత్సరములు వయస్సు పైబడిన వారు అప్లై చేసుకోవచ్చు.
  • TCS (టాడీ కో-ఆపరేటివ్ సొసైటీ) లేదా TFT (ట్రీ ఫర్ ట్యాపర్స్) సభ్యులైతే 01/02/2019 నాటికి వీరి వయస్సు 50 సంవత్సరములు పైబడిన వారై వుండాలి.

[adinserter block="5"]

(6) హెచ్.ఐ.వి వ్యాధి గ్రస్తుల ఫించను [PLHIV ART Pension]

  • ఇక్కడ PLHIV ART Pension లో ART అనేది యాంటీ రెట్రో వైరల్ థెరపీ కి షార్ట్ ఫార్మ్.
  • ART Pension కేవలం ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు సంబంధించిన ఫించను. చాలా మంది సాంస్కృతిక కళాకారులకు సంబంధించిన ఫించను అని పొరబడుతున్నారు.
  • వీరికి ఎటువంటి వయోపరిమితి లేదు.
  • ART థెరపీ లో కంటిన్యూగా ఆరు నెలల చికిత్స తీసుకున్న లేదా తీసుకుంటున్న వారై వుండాలి.



(7) ట్రాన్స్ జెండర్ ఫించను [Transgender Pension]

  • ఈ ఫించను క్రింద హిజ్రాలకు, లింగ మార్పిడి చేయించుకున్న వారికి నెల నెల 3000 రూపాయిలు ఇస్తోంది.
  • వీరు 18 సంవత్సరాలు నిండిన వారై ఉండాలి.

(8) మత్స్యకారుల ఫించను [Fisherman Pension]

  • మత్స్యకారుల వృత్తిని కొనసాగిస్తున్న జాలర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా అందిస్తోన్న ఫించను ఇది.
  • వీరి వయస్సు 50 సంవత్సరాలు దాటి ఉండాలి.

(9) ఒంటరి మహిళ ఫించను [Single Woman Pension]

  • సింగిల్ ఉమెన్ పెన్షన్ ఒంటరిగా నివసిస్తున్న మహిళలకు వర్తిస్తుంది.
  • భర్తతో విడిపోయిన వివాహిత మహిళకైతే 35 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. అలాగే ఫించను మంజూరు అయ్యే నాటికి భర్త తో విడిపోయి కనీసం ఒక సంవత్సరం అయ్యి వుండాలి.
  • గ్రామీణ అవివాహిత మహిళలైతే కనీసం 30 సంవత్సరాల వయస్సు పైబడిన వారై ఉండాలి.
  • అర్బన్ (పట్టణ) అవివాహిత మహిళలైతే కనీసం 35 సంవత్సరాల వయస్సు పైబడిన వారై ఉండాలి.
  • అనుకోని సంఘటనల వల్ల ఒంటరిగా నివసిస్తున్న మహిళలు (కనపడకుండా పోయిన భర్త, దేశ దిమ్మరి అయిన భర్త) కూడా 35 సంవత్సరాల వయస్సు పైబడిన వారై ఉండాలి.

(10) కిడ్నీ డయాలసిస్ ఫించను [CKDU Pension]

సికెడియు ఫించను వివరాలు || CKDU Pension in YSR Pension Kanuka || ysrpension Kanuka || teluguposts
సికెడియు ఫించను వివరాలు - CKDU Pension Details, YSR Pension Kanuka
  • కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్న వీరికి ఎటువంటి వయస్సు పరిమితి లేదు.
  • CKDU అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ (CKDU full form Chronic Kidney Disease of Unknown).
  • ధీర్గకాలిక మూత్ర పిండాల వ్యాధితో బాధ పడుతున్న వారి కోసం YSRPension Kanuka క్రింద CKDU pension ఇస్తోంది.
  • సికెడియు ఫించను కింద మూత్ర పిండాల డయాలసిస్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలోనే అత్యధికంగా పది వేల రూపాయిలు అందిస్తోంది.

[adinserter block="1"]

(11) సాంప్రదాయ తోలు వృత్తి కార్మికుల ఫించను [Traditional Cobblers Pension]

  • తోలు వృత్తినే జీవనాధారముగా చేసుకొని జీవించేవారు అర్హులు. (చెప్పులు కుట్టువారు, లెదర్ బెల్ట్, బ్యాగులు కుట్టువారు)
  • వీరికి కనీసం 40 సంవత్సరాలు నిండిన ఉండాలి.

(12) డప్పు కళాకారుల ఫించను [Dappu Artists Pension]

  • వీరు కనీసం 50 సంవత్సరాలు పై బడిన వారై ఉండాలి.
  • డప్పు విద్యనే జీవనాధారంగా చేసుకున్న వారు, గ్రామాల్లో డప్పు చాటింపు వేసే వారు అర్హులు.

భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పెన్షన్ (YSR Pension Kanuka) డబ్బును గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందిస్తోంది వై. ఎస్. జగన్ సర్కారు.

 

Leave a Reply